Gold Loan Rules: డబ్బు అవసరమైనప్పుడు చాలా మంది త్వరగా రుణం పొందేందుకు గోల్డ్ లోన్ తీసుకుంటారు. బంగారాన్ని తాకట్టు పెట్టి సులభంగా రుణం పొందవచ్చు. అయితే రుణం తీసుకున్న తర్వాత సమయానికి వడ్డీ లేదా అసలు మొత్తాన్ని చెల్లించకపోతే బ్యాంకులు చివరకు బంగారాన్ని వేలం వేయగలవు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం.
మొదట బ్యాంకు రిమైండర్‌లు
రుణం తీసుకున్న తర్వాత వడ్డీ లేదా EMI సమయానికి చెల్లించకపోతే మొదట బ్యాంకు నుంచి రిమైండర్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్ వస్తాయి. ఈ దశలో సమస్యను సులభంగా పరిష్కరించుకోవచ్చు.
వడ్డీ పెరుగుతూనే ఉంటుంది
సమయానికి చెల్లించకపోతే రుణంపై వడ్డీ పెరుగుతూ ఉంటుంది. కొన్ని నెలల తర్వాత చెల్లించాల్సిన మొత్తం మొదట తీసుకున్న మొత్తానికి కంటే ఎక్కువగా మారుతుంది.
అధికారిక నోటీసు పంపుతుంది
పలుమార్లు గుర్తు చేసినప్పటికీ రుణం చెల్లించకపోతే బ్యాంకు అధికారిక నోటీసు పంపుతుంది. ఇందులో నిర్దిష్ట గడువులోగా రుణం చెల్లించాలని హెచ్చరిస్తుంది.
బంగారం వేలం ప్రక్రియ
గడువు ముగిసినా రుణం చెల్లించకపోతే బ్యాంకు చట్టపరంగా తాకట్టు పెట్టిన బంగారాన్ని వేలం వేయగలదు. ఈ వేలం ద్వారా వచ్చిన డబ్బుతో రుణం, వడ్డీని వసూలు చేస్తారు.
మిగిలిన డబ్బు తిరిగి ఇవ్వవచ్చు
వేలంలో బంగారం ఎక్కువ ధరకు అమ్ముడైతే రుణం మొత్తాన్ని తీసుకున్న తర్వాత మిగిలిన డబ్బును బ్యాంకు రుణగ్రహీతకు తిరిగి ఇస్తుంది.
ఇవీ చదవండి: Gold Price: బంగారం ధరల్లో చారిత్రక పతనం.. కొనుగోలుదారులకు బంగారు అవకాశం?
Gold and Silver Price: యుద్ధ ఉద్రిక్తతల మధ్య తగ్గుతున్న బంగారం ధరలు.. కారణాలేమిటి?
Gold, Silver Shock: యుద్ధ ప్రభావం.. లోహాల ధరలు కుప్పకూలాయి!
