Anna Lezhneva: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత Pawan Kalyan భార్య Anna Lezhneva సోషల్ మీడియాలో అధికారికంగా అడుగుపెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె చేసిన మొదటి పోస్ట్ కొద్దిసేపట్లోనే వైరల్ అవుతోంది.
Anna Lezhneva బుధవారం (మార్చి 25) anna.konidala పేరుతో అధికారికంగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించారు. మొదటి పోస్టుగా భర్త Pawan Kalyan తో కలిసి దిగిన ఒక క్యూట్ ఫోటోను షేర్ చేశారు.
చాలా కాలంగా ఇన్‌స్టాగ్రామ్‌లోకి రావాలని అనుకుంటున్నానని, ఇప్పుడు సరైన సమయం అనిపించిందని ఆమె తన పోస్టులో పేర్కొన్నారు.
అలాగే Chiranjeevi ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ సపోర్ట్‌తో సోషల్ మీడియాలోకి రావడం ఆనందంగా ఉందని తెలిపారు. ఖాతా ఓపెన్ చేసిన వెంటనే ఆమె పలువురు సెలబ్రిటీలను ఫాలో అయ్యారు. అందులో Mahesh Babu, Namrata Shirodkar, Samantha Ruth Prabhu, Alia Bhatt వంటి ప్రముఖులు ఉన్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా భార్యకు ప్రత్యేకంగా స్వాగతం చెప్పారు. “ఇన్‌స్టాగ్రామ్‌లోకి వచ్చినందుకు అభినందనలు. నీ విలువైన ఆలోచనలు ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా పంచుకుంటావని ఆశిస్తున్నాను” అని పోస్ట్ చేశారు.
ఖాతా ప్రారంభించిన కొద్దిసేపట్లోనే అన్నా లెజినోవా ఫాలోవర్లు వేగంగా పెరిగారు. ప్రస్తుతం ఆమెను 1.5 లక్షలకు పైగా (157K) మంది ఫాలో అవుతున్నారు. సోషల్ మీడియాలో ఆమె మొదటి పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.
Read also: Pawan Kalyan Ranveer Singh: పవన్ vs రణ్‌వీర్: బాక్సాఫీస్ వద్ద మూడోసారి పోటీ.. ఈసారి ఎవరిది పైచేయి?
Pawan Kalyan Remunaration: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం పవన్ కల్యాణ్ రెమ్యునరేషన్ తగ్గించారా? నెట్టింట ఆసక్తికర చర్చ
Pawan Kalyan: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి.. ఉగాదికే రిలీజ్.. రన్ టైమ్?
