HomeAndhra PradeshAPSDMA: ఏపీలో మరో మూడు రోజులు పిడుగులతో వర్షాలు.. ప్రజలకు APSDMA హెచ్చరిక

APSDMA: ఏపీలో మరో మూడు రోజులు పిడుగులతో వర్షాలు.. ప్రజలకు APSDMA హెచ్చరిక

APSDMA: ఆంధ్రప్రదేశ్‌లో రానున్న మూడు రోజుల పాటు మేఘావృత వాతావరణంతో పాటు పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఉత్తరాంధ్ర మరియు దాని పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి సుమారు 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటం, తమిళనాడు–అంతర్గత కర్ణాటక మీదుగా ద్రోణి విస్తరించడం వల్ల ఈ వాతావరణ పరిస్థితులు ఏర్పడుతున్నాయని APSDMA మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు.

ఈ ప్రభావంతో రాష్ట్రంలో పలుచోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పనులు చేస్తున్నప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పిడుగులు పడే సమయంలో చెట్ల క్రింద, పొలాల్లో లేదా బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదని హెచ్చరించారు. ఇంట్లో ఉన్న సమయంలో ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు.

మంగళవారం (24-03-26)
మన్యం, అల్లూరి, పోలవరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు.

బుధవారం (25-03-26)
విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇతర జిల్లాల్లో కూడా చెదురుమదురుగా వర్షాలు పడవచ్చని తెలిపారు.

గురువారం (26-03-26)
విజయనగరం, మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని APSDMA వెల్లడించింది.

ప్రజలు అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని, పిడుగులు పడే సమయంలో సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని అధికారులు సూచించారు. రైతులు వ్యవసాయ పనుల సమయంలో వాతావరణ సూచనలు గమనిస్తూ జాగ్రత్తలు పాటించాలని APSDMA విజ్ఞప్తి చేసింది.

ఇవీ చ‌ద‌వండి: Andhra Weather: ఏపీకి వాతావరణశాఖ బిగ్ అలర్ట్… ఈ జిల్లాల్లో ఫాగ్ వార్నింగ్… ఉదయం వేళల్లో తీవ్ర ప్రమాదం!
Telangana Weather Update: మరో రెండు రోజులు చలి పంజా.. హైదరాబాద్‌లో ప్రమాదకర స్థాయిలో వాయు కాలుష్యం
Hot weather care: ఎండ వేడిమికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు