Singer Mangli: టాలీవుడ్ ఫోక్ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న మంగ్లీ ప్రస్తుతం ప్లేబ్యాక్ సింగర్‌గా కూడా దూసుకుపోతోంది. తెలుగు మాత్రమే కాదు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లోనూ అవకాశాలు అందుకుంటూ తన కెరీర్‌ను విస్తరిస్తోంది. స్టార్ హీరోల సినిమాల్లో పాటలు పాడే స్థాయికి చేరుకున్న మంగ్లీ ఇప్పుడు ఊహించని వివాదంలో చిక్కుకోవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఇటీవల కన్నడ స్టార్ హీరో ధ్రువ సర్జా నటిస్తున్న పాన్ ఇండియా సినిమా KD: ది డెవిల్ నుంచి “సర్కే చునర్ తేరి సర్కే” అనే స్పెషల్ సాంగ్ విడుదలైంది. దర్శకుడు ప్రేమ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా భారీ అంచనాల మధ్య రూపొందుతోంది. రిలీజ్ అయిన వెంటనే ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అయింది.
అయితే, ఈ వైరల్ క్రేజ్‌తో పాటు భారీ విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఈ పాటలో ఉన్న లిరిక్స్, విజువల్స్ అశ్లీలంగా ఉన్నాయని నెటిజన్స్ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది బూతు పాట అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరిగింది.
ఈ వివాదం ఇక్కడితో ఆగలేదు. ముంబైకి చెందిన ప్రముఖ న్యాయవాది వినీత్ జిందాల్ ఈ పాటపై అధికారిక ఫిర్యాదు చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC)తో పాటు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు కంప్లైంట్ అందించారు.
ఫిర్యాదులో కీలక అంశాలు:
ఈ పాట మైనర్లపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొన్నారు
వెంటనే ఈ పాటను అన్ని ప్లాట్‌ఫార్మ్స్ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు
ఈ సాంగ్‌కు పనిచేసిన టీమ్‌పై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు
ఈ కేసులో దర్శకుడు ప్రేమ్, లిరిసిస్ట్ రాకీబ్ ఆలం, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్, అలాగే సింగర్ మంగ్లీ పేర్లు కూడా చేర్చినట్లు సమాచారం. విమర్శలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ పాటను యూట్యూబ్ నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు ఈ వివాదంపై మంగ్లీ స్పందించకపోవడం గమనార్హం.
ఇక సినిమా టీమ్ నుంచి కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాకపోవడంతో ఈ వివాదం మరింత హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ అంశంపై చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. మంగ్లీ కెరీర్‌లో ఇది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక ముందు ఈ విషయంపై ఆమె ఎలా స్పందిస్తుందో చూడాలి.
ఇవీ చదవండి: Neelam Kothari: గోవిందతో రొమాంటిక్ రిలేషన్? నీలం కొఠారి షాకింగ్ రిప్లయ్!
Netflix War Machine Review: Alien Attack, Military Action.. ఈ హాలీవుడ్ Sci-Fi మూవీ మిస్ అయితే పెద్ద తప్పే!
Actress Supritha : మనసులో మాట బయటపెట్టిన సుప్రీత.. అతడంటే పిచ్చి ఇష్టమని కామెంట్స్
