Suriya: కోలీవుడ్ స్టార్ హీరో Suriya నటిస్తున్న కొత్త సినిమా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగు దర్శకుడు Venky Atluri దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి రూపొందుతోంది. ప్రముఖ నిర్మాణ సంస్థ Sithara Entertainments ఈ సినిమాను నిర్మిస్తోంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. పోస్టర్‌ను బట్టి చూస్తే ఈ సినిమా ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కుతున్నట్టు తెలుస్తోంది. సూర్య మరోసారి భావోద్వేగభరితమైన పాత్రలో కనిపించనున్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించారు. ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ టీజర్‌ను ఈ నెల 16న సాయంత్రం 04:06 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో సూర్య అభిమానుల్లో ఉత్సాహం మరింత పెరిగింది.
ఈ సినిమాలో హీరోయిన్‌గా Mamitha Baiju నటిస్తోంది. అలాగే బాలీవుడ్ నటి Raveena Tandon, సీనియర్ నటి Radhika Sarathkumar కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సంగీతాన్ని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ G. V. Prakash Kumar అందిస్తున్నారు.
ఇప్పటికే ఈ చిత్రాన్ని జూలైలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. టీజర్ విడుదల తర్వాత సినిమా పై అంచనాలు మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
ఇవీ చదవండి: Sanath Jayasuriya: టీ20 వరల్డ్ కప్ షాక్ తర్వాత సనత్ జయసూర్య రాజీనామా.. శ్రీలంక క్రికెట్‌లో కలకలం
Suriya Jyotika: జ్యోతిక శాలరీ గురించి సూర్య కామెంట్స్.. ఎన్నిరెట్లు ఎక్కువంటే!
Jyothika : ఆ ఒక్క అలవాటు మాత్రం నాకు అస్సలు నచ్చదు.. భర్త సూర్యపై జ్యోతిక సరదా కామెంట్స్… నెట్టింట వైరల్
