Tanushree Dutta: బాలీవుడ్ నటి Tanushree Dutta సినీ పరిశ్రమపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో అవకాశాల కోసం వచ్చే కొత్తవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలని ఆమె హెచ్చరించింది. అందం, కలలు, ఆశయాలను ఆసరాగా చేసుకుని కొందరు వారిని తప్పుదారి పట్టిస్తున్నారని తాజాగా ఒక పాడ్‌కాస్ట్‌లో వెల్లడించింది.
తనుశ్రీ దత్తా మాట్లాడుతూ సినీ పరిశ్రమలో మొదటగా అందానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని చెప్పింది. ఒక వ్యక్తికి నిజంగా టాలెంట్ ఉందా లేదా అన్నది చాలా సందర్భాల్లో పట్టించుకోరని ఆమె తెలిపింది. అందాన్ని చూసి ముందుగా పొగడ్తలు కురిపిస్తారని, అయితే ఆ మాటలు విని ఎవ్వరూ మోసపోవద్దని సూచించింది.
తన చిన్నతనంలో తల్లి చెప్పిన ఒక ఉదాహరణను గుర్తు చేసుకుంది. అపరిచితులతో మాట్లాడకూడదని, వాళ్లు ఇచ్చే చాక్లెట్లు తీసుకోకూడదని తల్లి చెప్పేదని తెలిపింది. సినీ పరిశ్రమలో కూడా అలాంటి అపరిచితులు, వారు ఇచ్చే “చాక్లెట్లు” వేరే రూపంలో ఉంటాయని ఆమె వ్యాఖ్యానించింది. మొదట పొగడ్తలతో దగ్గరవుతారని, తర్వాత అవకాశాల పేరుతో వారిని వాడుకుంటారని తెలిపింది.
ఈ ప్రక్రియలో కొందరు అవకాశాలు దక్కించుకుని విజయాన్ని సాధిస్తారని, మరికొందరు తీవ్ర నిరాశతో ఇండస్ట్రీని వదిలి వెళ్లిపోతారని చెప్పింది. ఇంకొంతమంది ముందుకు వెళ్లలేక, వెనక్కి వెళ్లలేక తీవ్ర ఇబ్బందుల్లో పడతారని కూడా పేర్కొంది. అయితే ఈ విషయాలు బయటకు ఎక్కువగా రావని, విజయ కథలే ఎక్కువగా వినిపిస్తాయని ఆమె అభిప్రాయపడింది.
“నా మాటల వల్ల నలుగురు అయినా జాగ్రత్తపడితే నాకు సంతోషమే. ఇండస్ట్రీలో కాంప్రమైజ్ సాధారణమని ఒక నటి చెప్పినందుకు నేను ఆమెతో స్నేహాన్ని కూడా తెంచుకున్నాను. నేను ఒక ఆర్టిస్ట్‌ను.. నా జీవితాన్ని ఎవరికైనా అమ్ముకునే వ్యక్తిని కాదు” అని తనుశ్రీ దత్తా స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే, MeToo movement సమయంలో కూడా తనుశ్రీ దత్తా పెద్ద సంచలనం సృష్టించింది. ప్రముఖ నటుడు Nana Patekar తనను లైంగికంగా వేధించాడని ఆరోపించింది. 2008లో వచ్చిన Horn Ok Pleassss సినిమా షూటింగ్ సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. అయితే ఈ కేసు పాతదని పేర్కొంటూ కోర్టు విచారణకు అంగీకరించలేదు.
బాలీవుడ్‌లో అనేక చిత్రాల్లో నటించిన తనుశ్రీ దత్తా, తెలుగులో కూడా Veerabhadra సినిమాలో నటించింది. ప్రస్తుతం ఆమె చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉంది.
ఇవీ చదవండి: Fish Venkat : నటుడు ఫిష్ వెంకట్ మృతి.. టాలీవుడ్‌లో విషాదం
Actress Sridevi : ఆ హీరో అభిమానులను ఆకర్షించిన కుర్ర హీరోయిన్.. సోషల్ మీడియాలో క్రేజ్
Actress Faria Abdullah : విమర్శల్ని ఛేదించి విన్నర్‌గా నిలిచిన ఫరియా అబ్దుల్లా.. టాలెంట్‌తోనే తన విలువ నిరూపించుకున్న స్టార్
