HomeCinemaVenu swamy on Yash: యశ్‌పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పాలంటూ ఫ్యాన్స్...

Venu swamy on Yash: యశ్‌పై వేణు స్వామి వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణలు చెప్పాలంటూ ఫ్యాన్స్ డిమాండ్

Venu swamy on Yash: ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితం, కెరీర్ గురించి సంచలన వ్యాఖ్యలు చేస్తూ తరచూ వార్తల్లో నిలిచే ఆయన, తాజాగా కన్నడ స్టార్ హీరో యశ్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీశాయి.

కొన్ని నెలల క్రితం ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణు స్వామి మాట్లాడుతూ యశ్ ప్రస్తుత పరిస్థితిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. “యశ్ అనే హీరో ఇప్పుడు చాలా కష్టమైన పరిస్థితిలో ఉన్నాడు. అతను కన్నడ హీరో కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను. అదే తెలుగు హీరో అయితే ఇలా మాట్లాడేవాడిని కాదు. ప్రస్తుతం యశ్ డిప్రెషన్‌లో ఉన్నాడు. కారణం ఏమిటంటే అతను చేసిన KGF సినిమాలు భారీ విజయాన్ని సాధించాయి. ఇప్పుడు ఆ స్థాయి సినిమా మళ్లీ చేయాలంటే అతనికి చాలా ఒత్తిడి ఉంది. తన స్టార్‌డమ్‌ను నిలబెట్టుకోవడం కోసం అతను తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు” అని వేణు స్వామి వ్యాఖ్యానించారు.

అయితే ఈ ఇంటర్వ్యూ రెండు నెలల క్రితం జరిగినప్పటికీ, ఇటీవల ఈ వీడియో క్లిప్ మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో యశ్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన హీరో గురించి ఆధారాలు లేకుండా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని ఫ్యాన్స్ మండిపడుతున్నారు. వెంటనే వేణు స్వామి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇక వేణు స్వామి వివాదాల్లో చిక్కుకోవడం ఇదే మొదటిసారి కాదు. గతంలోనూ పలువురు సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాలపై, భవిష్యత్తుపై వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్నారు. కొన్ని సందర్భాల్లో ఆయనపై పోలీస్ కేసులు కూడా నమోదయ్యాయి.

ప్రస్తుతం యశ్ అభిమానుల ఆగ్రహంతో ఈ వ్యవహారం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక వేణు స్వామి ఈ వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Read also: Venu Swamy : ప్రగతికి మెడల్ రావడంలో నా పాత్ర ఉంది.. వశీకరణం చేస్తాను కానీ తప్పు కాదు! – జ్యోతిష్యుడు వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు
Yash ‘Toxic’ Movie Postponed: యశ్ షాకింగ్ నిర్ణయం?.. ‘టాక్సిక్’ వాయిదా వెనక అసలు కారణం ఇదేనా!
Bhagyashree: భాగ్య‌శ్రీ ఫిట్‌నెస్ మంత్రం: 20 సెకన్ల కిక్‌తో శరీరం–మెదడుకు పవర్ బూస్ట్!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు