HomeCinemaJeevitha Rajasekhar: రాజశేఖర్‌కు గోటీల ఫ్యాక్టరీ ఉందా?.. వైరల్ ప్రచారంపై జీవిత క్లారిటీ

Jeevitha Rajasekhar: రాజశేఖర్‌కు గోటీల ఫ్యాక్టరీ ఉందా?.. వైరల్ ప్రచారంపై జీవిత క్లారిటీ

Jeevitha Rajasekhar: సోషల్ మీడియాలో రోజురోజుకు ఫేక్ న్యూస్, రూమర్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. తాజాగా టాలీవుడ్ నటుడు Dr. Rajasekhar గురించి కూడా ఇలాంటి ఒక వింత ప్రచారం వైరల్ అయింది. రాజశేఖర్‌కు గోటీల ఫ్యాక్టరీ ఉందని, అక్కడ పనిచేసేవారికి లక్షల్లో జీతాలు ఇస్తారని కొన్ని పోస్టులు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అయ్యాయి. ఈ వార్త కాస్తా నెట్టింట వైరల్ కావడంతో దీనిపై ఆయన భార్య, నటి Jeevitha Rajasekhar స్పందించారు.

జీవిత మాట్లాడుతూ.. అసలు గోటీల ఫ్యాక్టరీ అనే విషయం ఎలా వచ్చిందో తమకే అర్థం కాలేదని అన్నారు. సోషల్ మీడియాలో ఆ పోస్టులు చూసి తాము ఆశ్చర్యపోయామని, చివరకు కుటుంబమంతా చూసి నవ్వుకున్నామని తెలిపారు. ఇలాంటి వింత రూమర్లు ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువగా వస్తున్నాయని ఆమె చెప్పారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలే ఎక్కువగా జరుగుతున్నాయని జీవిత వ్యాఖ్యానించారు. ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయం తెలుసుకునే ప్రయత్నం చాలామంది చేయడం లేదని చెప్పారు. నెగెటివ్ వార్తలు వస్తే బాధపడాలా లేదా పట్టించుకోకూడదా అనే ఆలోచన కూడా చాలామందిలో కనిపించడం లేదని ఆమె అన్నారు.

అయితే ఈ ప్రచారం తమ కుటుంబంపై ఎలాంటి ప్రభావం చూపలేదని జీవిత స్పష్టం చేశారు. కానీ ఈ రూమర్‌ను ఉపయోగించుకుని కొంతమంది మోసాలకు ప్రయత్నించారని ఆమె వెల్లడించారు. తమకు గోటీల ఫ్యాక్టరీ ఉందని చెప్పి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు అడిగే ప్రయత్నాలు జరిగాయని విన్నామని చెప్పారు.

సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, రీల్స్ అన్నీ నిజం కావని జీవిత హెచ్చరించారు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో కనిపించే సమాచారం లో చాలా భాగం ఫేక్ అని పేర్కొన్నారు. అందుకే ఇలాంటి రూమర్లను ఎవరూ నమ్మవద్దని ప్రజలకు ఆమె విజ్ఞప్తి చేశారు.

ఇవీ చ‌ద‌వండి: Jeevitha Rajasekhar: జీవిత రాజశేఖర్‌కు రెండేళ్ల జైలు శిక్ష.. అల్లు అరవింద్‌ ఇచ్చిన పరువు నష్టం దావా కేసులో..!
INDW vs SLW 2nd T20I: షెఫాలీ తుఫాన్ హాఫ్ సెంచరీ… రెండో టీ20లోనూ టీమ్ ఇండియాదే ఘన విజయం
Actress Sridevi : ఆ హీరో అభిమానుల‌ను ఆక‌ర్షించిన కుర్ర హీరోయిన్.. సోష‌ల్ మీడియాలో క్రేజ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు