INDW vs SLW 2nd T20I: India Women – Sri Lanka Women మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. విశాఖపట్నంలోని Dr. YS Rajasekhara Reddy ACA-VDCA Cricket Stadiumలో జరిగిన రెండో టీ20లో టీమ్ ఇండియా ఏకపక్షంగా విజయం సాధించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
ఈ మ్యాచ్‌లో యువ విధ్వంసక బ్యాటర్ Shafali Verma మెరుపు హాఫ్ సెంచరీతో మ్యాచ్ విజేతగా నిలిచింది. అదే సమయంలో భారత బౌలర్లు కూడా కట్టుదిట్టమైన ప్రదర్శనతో శ్రీలంకను కట్టడి చేశారు.
తడబడిన శ్రీలంక బ్యాటింగ్
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక మహిళల జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 128 పరుగులకే పరిమితమైంది.
Harshitha Samarawickrama (33), కెప్టెన్ Chamari Athapaththu (31) మాత్రమే కాస్త పోరాడగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు.
భారత బౌలింగ్‌లో Vaishnavi Sharma (2/31), Sri Charani (2/23) తలా రెండు వికెట్లు తీశారు.
Sneh Rana (1/11), Kranti Goud పొదుపుగా బౌలింగ్ చేసి లంకపై ఒత్తిడి కొనసాగించారు.
షెఫాలీ విధ్వంసం
129 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు షెఫాలీ వర్మ దూకుడైన ఆరంభం ఇచ్చింది. కేవలం 27 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన ఆమె, శ్రీలంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది.
ఓపెనర్ Smriti Mandhana (14) త్వరగానే ఔటైనా, షెఫాలీ–Jemimah Rodrigues భాగస్వామ్యం జట్టును విజయానికి దగ్గర చేసింది. భారత్ కేవలం 11 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
షెఫాలీ వర్మ 34 బంతుల్లో 69 పరుగులతో అజేయంగా నిలిచింది. ఆమె ఇన్నింగ్స్‌లో 11 ఫోర్లు, ఒక సిక్సర్ ఉన్నాయి. జెమిమా (26), Harmanpreet Kaur (10) స్వల్పంగా సహకరించారు.
సిరీస్‌లో భారత్‌కు 2-0 ఆధిక్యం
ఈ విజయంతో టీమ్ ఇండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది. వరుసగా రెండు గెలుపులతో భారత జట్టు మంచి ఊపులో ఉంది. సిరీస్‌లో మూడో టీ20 మ్యాచ్ డిసెంబర్ 26న తిరువనంతపురంలో జరగనుంది.
ఇవీ చదవండి: Smriti Mandhana : వైజాగ్‌లో మంధాన విశ్వరూపం.. దుఃఖాన్ని జయించి రికార్డుల వేట.. వరల్డ్ రికార్డ్ బద్దలు
