SBI Youth for India Fellowship 2027: భారతదేశంలో గ్రామీణాభివృద్ధికి తోడ్పడాలనుకునే యువతకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మంచి అవకాశాన్ని అందిస్తోంది. SBI Youth for India Fellowship 2027 కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఫెలోషిప్ ద్వారా యువత గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసి సామాజిక మార్పుకు దోహదపడే అవకాశం పొందుతారు.
ఈ ఫెలోషిప్ మొత్తం 13 నెలలపాటు కొనసాగుతుంది. ఎంపికైన అభ్యర్థులు గ్రామాల్లో నివసిస్తూ విద్య, ఆరోగ్యం, జీవనోపాధి, పర్యావరణ పరిరక్షణ, మహిళా సాధికారత వంటి అంశాలపై పనిచేయాలి. గ్రామీణ జీవితాన్ని దగ్గరగా అర్థం చేసుకునే అవకాశం కలగడంతో పాటు, ప్రముఖ ప్రభుత్వేతర సంస్థలతో (NGOలు) కలిసి ప్రాజెక్టులపై పనిచేస్తారు. దీంతో యువతకు సామాజిక సేవతో పాటు నాయకత్వ నైపుణ్యాలు, ప్రాక్టికల్ అనుభవం కూడా లభిస్తుంది.
అర్హతలు
ఈ ఫెలోషిప్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు అయి ఉండాలి. అలాగే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 32 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే అభ్యర్థి 1994 ఆగస్టు 4కి ముందు, 2005 అక్టోబర్ 5 తరువాత జన్మించి ఉండకూడదు. భారతీయులతో పాటు నేపాల్ పౌరులు, ఓవర్సీస్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా (OCI), NRIలు కూడా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
దరఖాస్తు విధానం
అర్హులైన అభ్యర్థులు 2026 ఏప్రిల్ 30లోపు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపిక ప్రక్రియ రెండు దశల్లో ఉంటుంది. ముందుగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ మరియు అసెస్‌మెంట్ జరుగుతుంది. అనంతరం పర్సనల్ ఇంటరాక్షన్ లేదా ఇంటర్వ్యూ రౌండ్ నిర్వహిస్తారు. ఇందులో అభ్యర్థుల సామాజిక సేవపై ఆసక్తి, గ్రామీణాభివృద్ధికి దోహదపడే సామర్థ్యం, వారి అనుభవాలను అంచనా వేస్తారు.
ఫెలోషిప్ ప్రయోజనాలు
ఎంపికైన అభ్యర్థులకు నెలకు సుమారు రూ.21,000 స్టైపెండ్ అందిస్తారు. అలాగే రవాణా ఖర్చులు, ప్రాజెక్ట్ ఖర్చుల కోసం అదనపు భత్యం, భాషా మార్గదర్శకత్వం, ఏడాది పాటు మెంటర్‌షిప్ వంటి సదుపాయాలు కల్పిస్తారు. ఫెలోషిప్ పూర్తి చేసిన తరువాత రూ.1,10,000 గ్రాంట్ కూడా అందజేస్తారు.
గ్రామీణాభివృద్ధిలో భాగస్వామ్యం కావాలనుకునే యువతకు ఇది మంచి అవకాశం అని అధికారులు తెలిపారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు SBI Youth for India అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఇవీ చదవండి: SBI CBO: అడ్మిట్ కార్డులు విడుదల.. మార్చి 14న పరీక్ష | FDDI 2026 ప్రవేశ పరీక్ష మే 10న
Jobs in SBI : SBI ఉద్యోగాలు 2026 – Circle Based Officer పోస్టులకు భారీ నోటిఫికేషన్.. 2273 CBO పోస్టుల భర్తీకి State Bank of India అధికారిక ప్రకటన
SBI Bank Jobs 2025: రాత పరీక్ష లేకుండా ఎస్‌బీఐలో 996 ఉద్యోగాలు – డిగ్రీతోనే చాన్స్!
