HomeCinemaShivani Nagaram: ‘15 నిమిషాలు దర్శనం’ కామెంట్‌తో వివాదం.. తిరుమల దర్శన వ్యాఖ్యలపై శివానీ నగరం...

Shivani Nagaram: ‘15 నిమిషాలు దర్శనం’ కామెంట్‌తో వివాదం.. తిరుమల దర్శన వ్యాఖ్యలపై శివానీ నగరం క్లారిటీ

Shivani Nagaram: అంజాజీపేట మ్యారేజ్ బ్యాండు సినిమాతో హీరోయిన్‌గా పరిచయమై, తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ, ఆ తర్వాత Little Hearts సినిమాతో మరింత పాపులారిటీ సంపాదించింది. ఇందులో ఆమె పోషించిన ‘కాత్యాయని’ పాత్ర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తాజాగా Hey Balwantతో మరోసారి ఆడియెన్స్ ముందుకు వచ్చిన శివానీ, అనుకోకుండా ఒక వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

వివాదానికి కారణం ఏమిటంటే?
ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో శివానీ మాట్లాడుతూ, తనకు Tirumala Venkateswara Templeలో 15 నిమిషాల పాటు శ్రీవారి దర్శన భాగ్యం కల్పించారని చెప్పింది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవడంతో పాటు, సామాన్య భక్తుల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.

చాలామంది “సాధారణ భక్తులకు గంటల తరబడి క్యూ లైన్‌లో నిల్చోవాల్సి వస్తుంటే, సెలబ్రిటీలకు ప్రత్యేక సౌకర్యాలా?” అంటూ ప్రశ్నలు సంధించారు.

వీడియో ద్వారా క్లారిటీ
ఈ వివాదంపై స్పందించిన శివానీ మరో వీడియోను విడుదల చేస్తూ పూర్తి వివరాలు వెల్లడించింది.
2025 అక్టోబర్‌లో తాను తన అమ్మతో కలిసి రూ.10,500 కట్టి శ్రీవాణి దర్శనం టికెట్లు తీసుకున్నామని తెలిపింది.
క్యూ లైన్‌లో నిల్చొని సాధారణ భక్తుల్లాగే దర్శనం చేసుకున్నామని చెప్పింది.

క్యూ లైన్‌లో ముందుకు సాగుతున్నప్పుడు స్వామివారు క్రమంగా దర్శనమిస్తారని, ఆ మొత్తం ప్రక్రియ సుమారు 15 నిమిషాలు ఉంటుందని అంచనాతో అలా చెప్పానని వివరించింది.
“నన్ను 15 నిమిషాలు ఎవరూ టచ్ చేయకుండా ప్రత్యేకంగా నిలబెట్టారు” అనే అర్థంలో నేను చెప్పలేదని స్పష్టంచేసింది.
అంతేకాదు, తన శ్రీవాణి దర్శనం టికెట్‌ను కూడా కెమెరా ముందు చూపించి నిజాన్ని వెల్లడించింది.

‘నేను కూడా సాధారణ భక్తురాలినే’
శివానీ మాట్లాడుతూ, “నేను చాలా సార్లు రూ.300 దర్శనం టికెట్ తీసుకుని కుటుంబంతో కలిసి తిరుమల వెళ్తాను. అప్పుడు కేవలం 5 సెకన్ల పాటు మాత్రమే స్వామిని చూడగలుగుతాను. కానీ ఈసారి 13 ఏళ్ల తర్వాత తొలిసారి అంత సమీపం నుంచి దర్శనం చేసుకున్నాను. ఆ ఆనందంతోనే ఆ విషయం పంచుకున్నాను” అని చెప్పింది.

https://www.instagram.com/reel/DVLYAYkiRb3/?utm_source=ig_web_copy_link

ఇవీ చ‌ద‌వండి: Shivani Nagaram : ఇండస్ట్రీలో నాకు అత్యంత సపోర్టివ్ పర్సన్ అతనే.. శివానీ చెప్పిన ఆసక్తికర విషయాలు
Shivani Nagaram: ‘లిటిల్ హార్ట్స్’తో కుర్రాళ్ల మనసు దోచుకున్న హీరోయిన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు