HomeCinemaShivani Nagaram : ఇండస్ట్రీలో నాకు అత్యంత సపోర్టివ్ పర్సన్ అతనే.. శివానీ చెప్పిన ఆసక్తికర...

Shivani Nagaram : ఇండస్ట్రీలో నాకు అత్యంత సపోర్టివ్ పర్సన్ అతనే.. శివానీ చెప్పిన ఆసక్తికర విషయాలు

Shivani Nagaram : హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన యువ నటి శివాని నాగారం తన కెరీర్‌ను షార్ట్ ఫిల్మ్స్‌తో ప్రారంభించి, క్రమంగా వెబ్ సిరీస్‌ల ద్వారా గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా ‘మిస్టర్’ వంటి వెబ్ సిరీస్‌లతో యూట్యూబర్‌గా మంచి ఫ్యాన్‌బేస్ ఏర్పరుచుకుంది. ఈ క్రమంలోనే 2024లో అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్ సినిమాతో హీరోయిన్‌గా వెండితెరపై అడుగుపెట్టింది.

ఇన్‌స్టాగ్రామ్‌లో శివాని వీడియోలు చూసిన దర్శకుడు ఆమెకు ఈ సినిమాలో అవకాశం ఇవ్వడం విశేషం. తొలి సినిమాకే శివాని నటనపై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఆ తర్వాత గతేడాది విడుదలైన లిటిల్ హార్ట్స్ చిత్రంలో కాత్యాయని పాత్రలో ఆమె చేసిన నటన యువతను బాగా ఆకట్టుకుంది. దీంతో శివాని కుర్రాళ్ల ఫేవరెట్ హీరోయిన్‌గా మారిపోయింది.

సాధారణ హీరోయిన్లలా వరుసగా సినిమాలు ఒప్పుకోకుండా, కథ బాగుంటేనే ప్రాజెక్ట్స్ ఎంపిక చేసుకుంటూ సెలెక్టివ్‌గా ముందుకెళ్తోంది శివాని. ఈ క్రమంలో ఆమె త్వరలోనే హే భగవాన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోగా సుహాస్ నటిస్తున్నారు. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ తర్వాత మరోసారి సుహాస్–శివాని జంటగా కనిపించనున్నారు.

దర్శకుడు గోపి అచ్చర తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సుదర్శన్, అన్నపూర్ణమ్మ, యాంకర్ స్రవంతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 20న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్న శివాని, తాజాగా ఓ ఇంటర్వ్యూలో సుహాస్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
“సుహాస్‌తో ఇది నాకు రెండో సినిమా. ఈ మూవీ నాకు చాలా స్పెషల్. ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండ్’ సమయంలో ఆయన ప్రతి విషయంలో నాకు ఎంతో సపోర్ట్ చేశారు. ఇండస్ట్రీలో నాకు అత్యంత సపోర్టివ్ పర్సన్ అంటే సుహాసే. ఇప్పుడు మరోసారి ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది” అంటూ చెప్పుకొచ్చింది.

శివాని చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ చిత్రాన్ని త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బి. నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు. సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.

ఇవీ చదవండి: Little Hearts: ఈ బ్లాక్‌బస్టర్ మూవీని మిస్ చేసుకున్న హీరో ఎవరు?
Shivani Nagaram: ‘లిటిల్ హార్ట్స్’తో కుర్రాళ్ల మనసు దోచుకున్న హీరోయిన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు