HomeAndhra PradeshLunar eclipse : చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారి ఆలయం మూత

Lunar eclipse : చంద్రగ్రహణం కారణంగా మార్చి 3న శ్రీవారి ఆలయం మూత

Lunar eclipse : మార్చి 3వ తేదీన ఏర్పడనున్న చంద్రగ్రహణం నేపథ్యంలో Tirumala Venkateswara Templeను సుమారు 10.30 గంటల పాటు మూసివేయనున్నట్లు Tirumala Tirupati Devasthanams (టీటీడీ) ప్రకటించింది. ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7.30 గంటల వరకు ఆలయ తలుపులు మూసి ఉంటాయని స్పష్టం చేసింది.

చంద్రగ్రహణం మార్చి 3వ తేదీ సాయంత్రం 3.20 గంటలకు ప్రారంభమై 6.47 గంటలకు ముగుస్తుంది. సంప్రదాయం ప్రకారం గ్రహణ సమయానికి ఆరు గంటల ముందే ఆలయ తలుపులు మూసివేయడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

సాయంత్రం 7.30కి ఆలయ తలుపులు తెరిచి శుద్ధి కార్యక్రమాలు
సాయంత్రం 7.30 గంటలకు ఆలయ తలుపులు తెరిచి శుద్ధి, పుణ్యహవచనం వంటి సంప్రదాయ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అనంతరం రాత్రి 8.30 గంటల నుంచి భక్తులకు శ్రీవారి దర్శనం పునఃప్రారంభమవుతుంది.

ఆర్జిత సేవలు, వీఐపీ దర్శనాలు రద్దు
చంద్రగ్రహణం కారణంగా మార్చి 3వ తేదీ మంగళవారం క్రింది సేవలను టీటీడీ రద్దు చేసింది:
అష్టదళ పాద పద్మారాధన సేవ
కళ్యాణోత్సవం
ఊంజల్ సేవ
ఆర్జిత బ్రహ్మోత్సవం
సహస్రదీపాలంకార సేవ

వీటితో పాటు:
వీఐపీ బ్రేక్ దర్శనాలు
శ్రీవాణి దర్శనాలు
రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం
చంటి పిల్లల తల్లిదండ్రులు, వృద్ధులు, దివ్యాంగులు
దాతలు, ఎన్ఆర్ఐ దర్శనాలు
అన్నీ రద్దు చేసినట్లు టీటీడీ వెల్లడించింది.

భక్తులకు టీటీడీ విజ్ఞప్తి
శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించి తమ తిరుమల యాత్ర ప్రణాళికలను సరిచేసుకోవాలని టీటీడీ కోరింది. ఈ మేరకు టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారి ప్రకటన విడుదల చేశారు.

ఇవీ చదవండి: Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదంపై మరో డ్రామా.. సీబీఐ నివేదిక నచ్చక కొత్త కమిటీ.. న్యాయ నిపుణులు విస్తుపోయే స్పందన
Tirumala Laddu row : తిరుమల నెయ్యి కల్తీపై క్యాబినెట్ సీరియస్ నిర్ణయాలు.. దోషులపై కఠిన చర్యలు – స్వల్పకాలిక పరిపాలనా కమిటీ ఏర్పాటు

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు