HomeTelanganaTelangana High Court : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాలు TGHC నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌లో...

Telangana High Court : తెలంగాణ జిల్లా కోర్టుల్లో 859 ఉద్యోగాలు TGHC నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం

Telangana High Court : తెలంగాణ రాష్ట్రంలోని జిల్లా కోర్టుల్లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 859 పోస్టుల భర్తీకి టీజీహెచ్‌సీ (TGHC) అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఇది మంచి అవకాశంగా మారింది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 జనవరి 24 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తులు చేసుకోవచ్చు.

పోస్టుల వివరాలు – ఖాళీలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్–3 – 35
జూనియర్ అసిస్టెంట్ – 159
టైపిస్ట్ – 42
ఫీల్డ్ అసిస్టెంట్ – 61
ఎగ్జామినర్ – 49
కాపిస్ట్ – 63
రికార్డ్ అసిస్టెంట్ – 36
ప్రాసెస్ సర్వర్ – 95
ఆఫీస్ సబార్డినేట్ – 319
మొత్తం ఖాళీలు: 859

అర్హతలు
పోస్టును అనుసరించి 7వ తరగతి / ఇంటర్ / డిగ్రీ ఉత్తీర్ణత
కంప్యూటర్ నాలెడ్జ్ తప్పనిసరి
కొన్ని పోస్టులకు టైపింగ్ లేదా స్టెనోగ్రఫీ నైపుణ్యం అవసరం

వయోపరిమితి
కనీసం: 18 సంవత్సరాలు
గరిష్టం: 46 సంవత్సరాలు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు సడలింపు ఉంటుంది

జీతభత్యాలు
స్టెనోగ్రాఫర్: రూ.32,810 – రూ.96,890
జూనియర్ అసిస్టెంట్ / టైపిస్ట్ / ఫీల్డ్ అసిస్టెంట్: రూ.24,280 – రూ.72,850
ఎగ్జామినర్ / కాపిస్ట్ / ప్రాసెస్ సర్వర్: రూ.22,900 – రూ.69,150
రికార్డ్ అసిస్టెంట్: రూ.22,240 – రూ.67,300
ఆఫీస్ సబార్డినేట్: రూ.19,000 – రూ.58,850

దరఖాస్తు విధానం
ఆన్‌లైన్ ఆధారంగా మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తారు
దరఖాస్తు ఫీజు
జనరల్ / బీసీ: రూ.600
ఎస్సీ / ఎస్టీ / ఈడబ్ల్యూఎస్ / పీడబ్ల్యూడీ / ఈఎస్‌ఎం: రూ.400

ముఖ్య తేదీలు
దరఖాస్తు ప్రారంభం: 2026 జనవరి 24
చివరి తేదీ: 2026 ఫిబ్రవరి 13

ఎంపిక ప్రక్రియ
రాత పరీక్ష (CBT)
స్కిల్ టెస్ట్ (పోస్టును అనుసరించి)
తెలంగాణలో కోర్టు విభాగంలో స్థిరమైన ప్రభుత్వ ఉద్యోగం పొందాలని ఆశించే అభ్యర్థులకు ఈ నోటిఫికేషన్ మంచి అవకాశం. అర్హులైనవారు గడువు ముగిసేలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు.

ఇవీ చదవండి: Andhra Telangana : అప్పుల ఊబిలో తెలుగు రాష్ట్రాల రైతులు.. దేశంలోనే అత్యధిక అప్పుల భారంతో ఏపీ మొదటి స్థానం – టాప్ 5లో తెలంగాణ
Indian Air Force : అగ్నిపథ్ స్కీమ్ కింద భారత వాయుసేనలో నాన్-కంబాటెంట్ ఉద్యోగాలు.. అగ్నివీర్ వాయు నోటిఫికేషన్ విడుదల

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు