Telangana : తెలంగాణలోని రైతులు పెట్టుబడి సాయం కోసం నెలలుగా ఎదురుచూపులు చూస్తున్నారు. యాసంగి సీజన్ ప్రారంభమై మూడు నెలలు గడిచినా, రైతు భరోసా నిధులు ఇంకా జమ కాకపోవడంతో రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. Revanth Reddy నేతృత్వంలోని Telangana Government రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం చేయడంతో, సాగుకు పెట్టుబడి పెట్టేందుకు రైతులు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేయాల్సి వస్తోంది. మరికొందరు బంగారం తాకట్టు పెట్టి బ్యాంకుల నుంచి రుణాలు, అగ్రికల్చర్ లోన్లు తీసుకుంటూ పంట సాగు కొనసాగిస్తున్నారు.
సాధారణంగా జనవరిలోనే రైతు భరోసా నిధులు రైతుల ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా, కొన్ని పరిపాలనా కారణాల వల్ల ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వం త్వరగా నిధులు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. నిధుల జాప్యం వల్ల రైతుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
త్వరలో పీఎం కిసాన్ నిధులు
ఇదిలా ఉండగా, కేంద్ర ప్రభుత్వం త్వరలో పీఎం కిసాన్ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ చేయనుంది. బడ్జెట్ ప్రక్రియ పూర్తవడంతో, ఈ నెల చివరి వారంలోనే పీఎం కిసాన్ 22వ విడత నిధులను విడుదల చేసేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఫిబ్రవరి చివర్లో ప్రధాని Narendra Modi స్వయంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి సొమ్మును జమ చేయనున్నారని సమాచారం.
పీఎం కిసాన్‌తో పాటే రైతు భరోసా
పీఎం కిసాన్ నిధులతో పాటు రైతు భరోసా సొమ్మును కూడా దాదాపు అదే సమయంలో విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి పండక్కి ఈ నిధులు జమ చేయాల్సి ఉన్నప్పటికీ, సాగులో ఉన్న భూములను గుర్తించేందుకు చేపట్టిన శాటిలైట్ సర్వే పూర్తికాకపోవడంతో జాప్యం జరిగింది.
ఇటీవల శాటిలైట్ సర్వే పూర్తవ్వగా, దాని నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించారు. ఈ సర్వేలో సుమారు 10 శాతం భూముల్లో ప్రస్తుతం పంట సాగు జరగడం లేదని తేలింది. ఆ భూములకు రైతు భరోసా నిధులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. మిగిలిన అర్హులైన రైతులకు మాత్రం ఫిబ్రవరి చివరికల్లా రైతు భరోసా సొమ్మును విడుదల చేయనున్నారు.
రైతులకు డబుల్ బొనాంజా
ఈ నెల చివర్లో పీఎం కిసాన్, రైతు భరోసా నిధులు ఒకేసారి రైతుల ఖాతాల్లో పడే అవకాశం ఉండటంతో రైతులకు డబుల్ బొనాంజాగా మారనుంది. కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ కింద రూ.2 వేల చొప్పున జమ చేయనుండగా, తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా కింద ఎకరానికి రూ.6 వేల చొప్పున విడుదల చేయనుంది. దీంతో ఫిబ్రవరి నెలలో రైతుల బ్యాంకు ఖాతాల్లోకి భారీ మొత్తంలో నిధులు చేరనున్నాయి.
ఇవీ చదవండి: Rythu Bharosa: తెలంగాణలో అన్నదాతలకు శుభవార్త.. సంక్రాంతికి ముందే రైతు భరోసా నిధుల జమకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
Telangana: తెలంగాణ యూరియా యాప్ విజయవంతం… రైతులకు పారదర్శక ఎరువుల సరఫరా
