Anil Ravipudi : టాలీవుడ్‌లో ప్రస్తుతం హిట్స్ అంటే అనిల్ రావిపూడి అన్నట్టుగా మారింది. ప్రతి సంక్రాంతికి ఓ సినిమా… ప్రతిసారి విజయం… ఇదే ఫార్ములాతో దూసుకుపోతున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. అపజయం ఎరుగని దర్శకుడిగా తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్‌ను క్రియేట్ చేసుకున్నాడు అనిల్ రావిపూడి.
గతేడాది వెంకటేష్ తో తెరకెక్కించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో భారీ హిట్ అందుకున్న అనిల్, ఈ ఏడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవితో చేసిన మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. ఈ వరుస విజయాలతో అనిల్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
రూ.400 కోట్లకు పైగా వసూళ్లు… ఇంకా ఆగని రన్
మన శంకర వరప్రసాద్ గారు సినిమా విడుదలైన దగ్గర నుంచి కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఇప్పటికే రూ.400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. థియేటర్లలో ఇంకా విజయవంతంగా ప్రదర్శితమవుతూ దూసుకుపోతున్న ఈ సినిమా, త్వరలోనే ఓటీటీలోకి రానున్నట్టు టాక్ వినిపిస్తోంది.
అనిల్ నెక్స్ట్ సినిమా ఎవరివితో?
ఈ బ్లాక్‌బస్టర్ తర్వాత అనిల్ రావిపూడి నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాలు, సోషల్ మీడియా కథనాల ప్రకారం…
వెంకటేష్‌తో మరోసారి అనిల్ సినిమా చేయనున్నారని,
అలాగే మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ తో కూడా ఓ క్రేజీ ప్రాజెక్ట్ ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.
యాక్షన్ థ్రిల్లర్ ప్లాన్?
ఈసారి తన రొటీన్ కామెడీ ఫార్మాట్‌కు భిన్నంగా, అదిరిపోయే యాక్షన్ థ్రిల్లర్ను ప్లాన్ చేస్తున్నాడని నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. “ఇదెక్కడి కాంబోరా దేవుడా!” అంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ పోస్టులు షేర్ చేస్తూ రచ్చ చేస్తున్నారు. అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు అధికారిక క్లారిటీ మాత్రం రాలేదు.
సంక్రాంతి 2027 టార్గెట్
ఇప్పటికే అనిల్ రావిపూడి మాత్రం ఓ విషయం స్పష్టంగా చెప్పాడు –
👉 వచ్చే ఏడాది సంక్రాంతికి తప్పకుండా కొత్త సినిమాతో వస్తాను అని.
మరి ఆ సినిమా ఎవరివితో? ఏ జానర్‌లో? అన్నది తెలియాలంటే ఇంకొద్ది రోజులు ఆగాల్సిందే. అప్పటివరకు అనిల్ నెక్స్ట్ ప్రాజెక్ట్‌పై టాలీవుడ్ అంతా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తోంది.
ఇవీ చదవండి: Anil Ravipudi : మెగాస్టార్ హిట్ తర్వాత… అనిల్ రావిపూడి నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఐదోసారి ‘విక్టరీ’ కోసం భారీ మల్టీస్టారర్ స్కెచ్!
Anil Ravipudi : కొత్త మూవీ.. అనిల్ రావిపూడి ఈసారి దొరుకుతాడా? మస్కా కొట్టేస్తాడా?
