Anil Ravipudi : ఈసారి అయినా అనిల్ రావిపూడికి బ్రేక్ పడుతుందా..? అంటూ సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. వరుసగా విజయాలు సాధిస్తూ టాలీవుడ్‌లో అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడిపై నెటిజన్స్ మరోసారి ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఇప్పటికే రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి, రూ.350 కోట్ల మార్క్ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ భారీ విజయం అనిల్ రావిపూడి కెరీర్‌కు మరో బిగ్ బూస్ట్‌గా మారింది.
గతంలో వెంకటేష్‌తో చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా కూడా బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో, ప్రతి సంక్రాంతికీ హిట్ కొట్టే దర్శకుడిగా అనిల్‌కు ప్రత్యేక గుర్తింపు ఏర్పడింది. వరుస హిట్లతో దూసుకుపోతున్న అతడిపై ప్రేక్షకుల్లో అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
అయితే ఇదే సమయంలో సోషల్ మీడియాలో కొందరు నెటిజన్స్ సరదాగా ట్రోల్స్ చేస్తున్నారు.
“అనిల్ ఎప్పుడు దొరుకుతాడో చూద్దాం”
“ఈసారి మాత్రం ఫ్లాప్ పడుతుందేమో”
అంటూ ఫన్నీ మీమ్స్ వైరల్ అవుతున్నాయి.
ఇప్పటికే “ఈసారి దొరుకుతాడు అనుకున్నాం… కానీ మళ్లీ తప్పించుకున్నాడు” అంటూ మీమ్స్ షేర్ చేస్తుండగా, ఇప్పుడు ఆయన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించే మరో కొత్త ట్రెండ్ మొదలైంది.
నెటిజన్స్ కథనం ప్రకారం అనిల్ రావిపూడి తదుపరి సినిమాలో డిజాస్టర్ హీరో – అట్టర్ ఫ్లాప్ హీరోయిన్ ఉంటారట. దీంతో “ఇప్పుడు ఎందుకు దొరకడో చూద్దాం” అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ మొదలైంది.
ఇంతకీ ఆ హీరో, హీరోయిన్ ఎవరు అనే ఆసక్తి పెరిగిపోగా… నెటిజన్స్ చెప్పేది మాత్రం అఖిల్ అక్కినేని – శ్రీలీల పేర్లే.
అఖిల్ అక్కినేని వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఇప్పటివరకు సరైన బ్లాక్‌బస్టర్‌ను అందుకోలేకపోయాడు. మరోవైపు శ్రీలీలకు కూడా ఇటీవల కాలంలో హిట్లు దక్కడం లేదు. పెద్ద హీరోల సరసన అవకాశాలు వచ్చినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదన్న విమర్శలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో ఈ ఇద్దరితో అనిల్ సినిమా చేస్తే ఈసారి మాత్రం తప్పక దొరుకుతాడేమో అంటూ నెటిజన్స్ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇది ఇప్పటివరకు కేవలం సోషల్ మీడియా ప్రచారమే తప్ప అధికారికంగా ఎలాంటి ప్రకటన మాత్రం వెలువడలేదు.
మరి నిజంగానే అనిల్ రావిపూడి కెరీర్‌కు ఇది పరీక్ష అవుతుందా..?
లేదా మరోసారి తన మార్క్ కమర్షియల్ మ్యాజిక్‌తో ట్రోల్స్‌కు చెక్ పెడతాడా..?
అన్నది వేచి చూడాల్సిందే.
ఇవీ చదవండి: Mana Shankara Vara Prasad Garu : మన శంకరవరప్రసాద్ గారు తొలిరోజు కలెక్షన్స్
Sankranti Cinema : సంకురాతిరికి సినిమాల జాతర.. డామినేషన్ ఎవరిది?
