Tollywood : టాలీవుడ్ నటి అనూజ రెడ్డి తాజాగా ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం, ఇండస్ట్రీ నుంచి తీసుకున్న విరామం, అలాగే రీ-ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు వరుస అవకాశాలతో దూసుకెళ్లిన అనూజ రెడ్డి దాదాపు 250 సినిమాల్లో నటించిన అనంతరం వ్యక్తిగత కారణాలతో 20 ఏళ్ల పాటు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉన్నట్టు వెల్లడించారు.
ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రావాలని భావిస్తున్నానని, అవకాశం వస్తే మరో 250 సినిమాలు చేసే శక్తి తనలో ఉందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. సినిమాలకే కాకుండా పలు టెలివిజన్ సీరియల్స్‌లో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నానని తెలిపారు.
ప్రస్తుత టాలీవుడ్‌లో కొత్త దర్శకులు, నిర్మాతలు ఎక్కువయ్యారని, అందువల్ల తమలాంటి పాత నటీనటులను పరిశ్రమ కొంతవరకు మర్చిపోయిందని అనూజ రెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే ప్రేక్షకులు మాత్రం ఇప్పటికీ తమను గుర్తు పెట్టుకుని ప్రేమ చూపిస్తుండటం ఆనందంగా ఉందని చెప్పారు.
రీ-ఎంట్రీ విషయంలో స్పష్టమైన కండిషన్ పెట్టిన అనూజ రెడ్డి.. మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రలకే తాను ఓకే చెబుతానని స్పష్టం చేశారు. ముఖ్యంగా అమ్మ, అక్క వంటి క్యారెక్టర్లకు ప్రాధాన్యం ఇస్తానని, కథలో బలమైన పాత్రలు చేయడమే తన లక్ష్యమని వివరించారు.
ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన హీరోల గురించి కూడా మాట్లాడిన అనూజ రెడ్డి.. Jr. NTR, Mahesh Babu అంటే తనకు చాలా ఇష్టమని, ముఖ్యంగా మహేష్ బాబు మొదటి నుంచే తన ఫేవరెట్ హీరో అని పేర్కొన్నారు. అలాగే సూపర్ స్టార్ Krishnaతో కలిసి నటించిన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.
కృష్ణతో కలిసి నటించిన ఓ ముద్దు సీన్ గురించి ఆసక్తికర విషయం వెల్లడించిన అనూజ రెడ్డి.. ఆ సీన్ కోసం కావాలనే నాలుగు టేక్‌లు మాత్రమే తీసుకున్నామని, ఆ అనుభవం ఇప్పటికీ గుర్తుండిపోయిందని చెప్పారు. ప్రస్తుతం కూడా పలువురు పాత నటీనటులు తిరిగి సినిమాల్లోకి రావాలని అభిమానులు కోరుకుంటున్నారని ఆమె తెలిపారు.
ఇవీ చదవండి: Cinema 2025 : ఈ ఏడాది వచ్చిన హిట్లు, ప్లాపులు, కలెక్షన్లు, కాంట్రవర్సీలు.. టాలీవుడ్ రివైండ్ 2025
Avantika Vandanapu : అవంతిక.. యువత గుండెల్లో మెలిక.. అందం, అభినయంతో ఆకట్టుకుంటున్న అమ్మడు
