HomeTelanganaTelangana : తెలంగాణలో అత్యంత పేదల కోసం కొత్త కార్యక్రమం.. ఇంటింటి సర్వే ద్వారా గుర్తింపు.....

Telangana : తెలంగాణలో అత్యంత పేదల కోసం కొత్త కార్యక్రమం.. ఇంటింటి సర్వే ద్వారా గుర్తింపు.. విడతల వారీగా ప్రభుత్వ సహాయం

Telangana : సంక్రాంతి పండుగ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి మరో కీలక అడుగు వేసింది. ఇప్పటికే పలు సంక్షేమ పథకాలతో ముందుకు సాగుతున్న Telangana Government.. ఇప్పుడు రాష్ట్రంలోని అత్యంత పేద కుటుంబాలను గుర్తించి, వారికి సమగ్రంగా సహాయం అందించే దిశగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది.

ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో అత్యంత వెనుకబడిన వర్గాలను గుర్తించి, వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే లక్ష్యంతో ప్రత్యేక సర్వే చేపట్టనున్నట్లు తెలిపారు.

ఇంటింటి సర్వే ద్వారా పేదల గుర్తింపు

సచివాలయంలో ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో దివ్య దేవరాజన్ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి సర్వే నిర్వహించి, అత్యంత పేదరికంలో ఉన్న కుటుంబాలను గుర్తించాలని అధికారులను మంత్రి ఆదేశించారు.

ఈ సర్వేను మహిళా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. దశలవారీగా ఈ ప్రక్రియ కొనసాగనుండగా, తొలుత అత్యంత వెనుకబడిన గ్రామాల్లో సర్వే చేపట్టనున్నారు. సర్వే ఆధారంగా అర్హులైన లబ్దిదారులను గుర్తించి, వారికి ప్రభుత్వ సహాయాన్ని అందించనున్నారు.

విద్య నుంచి ఉపాధి వరకు సమగ్ర సహాయం
గుర్తించిన లబ్దిదారులకు విద్య, ఉపాధి, ఆరోగ్యం, నైపుణ్యాభివృద్ధి (Skill Development) వంటి రంగాల్లో ప్రభుత్వం సహకారం అందించనుంది. ప్రతి కుటుంబ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని అవసరానికి అనుగుణంగా మద్దతు ఇవ్వాలని నిర్ణయించారు.

లబ్దిదారుల ఎంపికలో పూర్తిస్థాయి పారదర్శకత ఉండాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామసభల ద్వారా ప్రజలందరి సమక్షంలో ఎంపిక ప్రక్రియ జరగనుందని తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డితో చర్చ తర్వాత తుది నిర్ణయం
ఈ కార్యక్రమానికి సంబంధించి త్వరలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి వెల్లడించారు. పేదలను ఆర్థికంగా బలోపేతం చేసి, స్వావలంబన దిశగా నడిపించడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Khammam Crime : అమ్మానాన్న… ఇలా జరిగిందేంటి? గుడ్ న్యూస్ చెప్పిన కొద్ది రోజులకే దంపతులు
Telangana: అన్నదాతలకు గుడ్ న్యూస్.. ఈ నెల నుంచే కొత్త పథకం అమలు.. రూ.101 కోట్ల నిధులు విడుదల!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు