HomeCrime NewsKhammam Crime : అమ్మానాన్న… ఇలా జరిగిందేంటి? గుడ్ న్యూస్ చెప్పిన కొద్ది రోజులకే దంపతులు

Khammam Crime : అమ్మానాన్న… ఇలా జరిగిందేంటి? గుడ్ న్యూస్ చెప్పిన కొద్ది రోజులకే దంపతులు

Khammam Crime : మృత్యువులోనూ భార్యాభర్తల బంధం విడవలేదు. ఎన్నో కలలు, ఆశలు, బాధ్యతలతో జీవితం ముందుకు సాగిస్తున్న ఆ దంపతులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఒక్కసారిగా జరిగిన ఈ విషాద ఘటనతో ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారారు. ఈ హృదయ విదారక ఘటన ఖమ్మం జిల్లాలోని వైరా మండలం పరిధిలో చోటుచేసుకుంది.

ఇటీవలే వచ్చిన గుడ్ న్యూస్… అంతలోనే విషాదం

భర్త చిరు వ్యాపారంతో కుటుంబాన్ని పోషిస్తుండగా, భార్య ఎంతో కష్టపడి ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. ఆ ఆనందం ఇంకా చల్లారకముందే, ఆ కుటుంబంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవితం సాగిస్తున్న ఆ దంపతుల కలలను రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా చెదరగొట్టింది.

అర్ధరాత్రి జరిగిన ఘోర ప్రమాదం

ఈ ప్రమాదం వైరా మండలం సోమవరం గ్రామం సమీపంలో అర్ధరాత్రి జరిగింది. వైరా మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న వడ్డాది రాము – వెంకటరత్నం దంపతులు ఈ ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.

వడ్డాది రాము గ్రామాల్లో తిరుగుతూ పరుపులు అమ్మే చిరు వ్యాపారం చేసేవాడు. ఆయన సతీమణి వెంకటరత్నం ఇటీవలే ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా నియామకం పొందింది. ఆమె ఎన్‌టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలంలో విధులు నిర్వహిస్తోంది.

లారీ ఢీకొని భార్య అక్కడికక్కడే మృతి

ఎప్పటిలాగే భర్త రాము తన వ్యాపారం ముగించుకొని, సతీమణి వెంకటరత్నాన్ని ట్రాలీ ఆటో క్యాబిన్‌లో కూర్చోబెట్టుకొని జగ్గయ్యపేట నుంచి వైరాకు బయలుదేరాడు. అయితే సోమవరం గ్రామ సమీపంలో వైరా నుంచి బోనకల్ వైపు వెళ్తున్న లారీ వేగంగా దూసుకొచ్చి ట్రాలీ ఆటోను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో వెంకటరత్నం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. భర్త రాముకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

చికిత్స పొందుతూ భర్త కూడా మృతి

సమాచారం అందుకున్న వెంటనే వైరా ఎస్సై పుష్పాల రామారావు తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన రామును 108 అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ రాము కూడా మృతి చెందాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ ఒకే ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

అనాథలైన ఇద్దరు చిన్నారులు… కంటతడి పెట్టించిన దృశ్యాలు

ఈ దంపతులకు ఇద్దరు చిన్న కుమారులు ఉన్నారు. తల్లిదండ్రుల ఆకస్మిక మృతితో ఆ పిల్లలు అనాథలుగా మారారు.
“అమ్మా… నాన్నా… మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్లారు?” అంటూ చిన్నారులు రోదిస్తున్న దృశ్యం అక్కడున్న ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.

దంపతుల దుర్మరణంతో వైరాలోని టీచర్స్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఇవీ చదవండి: Andhra Crime : నడిరాత్రి వేళ.. కోడలికోసం కాపుగాసిన మామ.. ఏం జరిగిందంటే!
Crime News : ప్రయాగ్‌రాజ్‌లో సెక్స్ రాకెట్ గుట్టు రట్టు.. 5 కాల్‌గర్ల్స్‌, నలుగురు కస్టమర్లు అరెస్ట్.. మహిళా IAS అధికారిణి పేరుతో ఉన్న ఇంట్లోనే అక్రమ దందా!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు