America : అమెరికా ప్రభుత్వం కీలకమైన, సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం, జనవరి 8, 2026న అమెరికా తన పౌరుల కోసం తాజా ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులను సమీక్షించిన అనంతరం, 21 దేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దు అంటూ అమెరికన్ పౌరులను హెచ్చరించింది.
ఈ కీలక సూచనలు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వ హయాంలో వెలువడ్డాయి. అయితే, ఈ జాబితాలో భారతదేశం మరియు పాకిస్తాన్ పేర్లు లేకపోవడం విశేషంగా మారింది.
సోషల్ మీడియా ద్వారా అధికారిక ప్రకటన
ఈ మేరకు US Department of Stateకి చెందిన కాన్సులర్ అఫైర్స్ విభాగం సోషల్ మీడియా వేదికగా X (ట్విట్టర్)లో అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్, తమ ట్రావెల్ అడ్వైజరీ వ్యవస్థను లెవల్ 1 నుంచి లెవల్ 4 వరకు అమలు చేస్తున్నట్లు వెల్లడించింది.
లెవల్ 1 – సాధారణ జాగ్రత్తలు
లెవల్ 2 – అదనపు జాగ్రత్తలు
లెవల్ 3 – ప్రయాణాన్ని పునరాలోచించాలి
లెవల్ 4 – ప్రయాణం చేయరాదు
లెవల్ 4 కేటాయించిన దేశాల్లో భద్రతా పరిస్థితులు తీవ్రంగా ఉన్నాయని, అక్కడ అమెరికా పౌరులకు సహాయం అందించే సామర్థ్యం కూడా పరిమితంగా ఉంటుందని స్టేట్ డిపార్ట్‌మెంట్ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాలు అత్యంత ప్రమాదకరమైనవిగా పేర్కొంటూ, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణించవద్దని కఠిన హెచ్చరిక జారీ చేసింది.
లెవల్ 4 కేటాయించిన 21 దేశాల జాబితా
అమెరికా ప్రభుత్వం ప్రయాణించవద్దని సూచించిన దేశాలు ఇవే:
ఆఫ్ఘనిస్తాన్
బెలారస్
బుర్కినా ఫాసో
బర్మా (మయన్మార్)
సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్
హైతీ
ఇరాన్
ఇరాక్
లెబనాన్
లిబియా
మాలి
నైజర్
ఉత్తర కొరియా
రష్యా
సోమాలియా
దక్షిణ సూడాన్
సూడాన్
సిరియా
ఉక్రెయిన్
వెనిజులా
యెమెన్
భారత్, పాక్‌కు లెవల్ 4 వర్తించలేదు
ఈ జాబితాలో భారతదేశం మరియు పాకిస్తాన్ పేర్లు లేకపోవడం అంతర్జాతీయంగా ఆసక్తికర చర్చకు దారి తీసింది. భద్రతా పరిస్థితుల ఆధారంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని అమెరికా అధికారులు స్పష్టం చేశారు.
ఇవీ చదవండి: Aman Rao : అమెరికాలో జననం.. చివరి బంతికి సిక్సర్‌తో డబుల్ సెంచరీ.. విజయ్ హజారేలో చరిత్ర రాసిన హైదరాబాద్ ఓపెనర్ అమన్ రావు ఎవరు?
America : భారతీయులకు వరుసగా షాకులిస్తున్న ట్రంప్ మావ.. టూరిస్ట్ వీసాలపై అమెరికా కఠిన నిర్ణయం
Visa : వీసా అవసరమే లేదు! ఇండియన్లు ఎంట్రీ ఫ్రీగా వెళ్లగల దేశాలు ఇవే
