HomeAndhra PradeshYS Sharmila : జాబ్ క్యాలెండర్ కాదు.. జోక్ క్యాలెండర్.. కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్...

YS Sharmila : జాబ్ క్యాలెండర్ కాదు.. జోక్ క్యాలెండర్.. కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల తీవ్ర విమర్శలు

YS Sharmila : విజయవాడ కేంద్రంగా రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి జాబ్ క్యాలెండర్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (APCC) చీఫ్ Y. S. Sharmila Reddy కూటమి ప్రభుత్వ పాలనపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రెండేళ్ల పాలన పూర్తయినా, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు కావడం లేదని, ఇది “హామీల ఘనత – అమలులో ఘరానా మోసం” అని ఆమె మండిపడ్డారు.

ఏటా జనవరి వస్తోంది.. జాబ్ క్యాలెండర్ మాత్రం కనిపించడంలేదు
ప్రతి సంవత్సరం క్యాలెండర్ మారుతున్నా, ఫస్ట్ తారీఖున విడుదల చేస్తామని చెప్పిన జాబ్ క్యాలెండర్‌కు మాత్రం దిక్కులేదని షర్మిల ఎద్దేవా చేశారు. “రికార్డు చేసి పెట్టుకోండి” అంటూ ఇచ్చిన వాగ్దానానికి కూడా విలువ లేకుండా పోయిందని విమర్శించారు. ఉద్యోగాల పేరుతో నిరుద్యోగ యువతకు ఆశ చూపి, భారీగా ఓట్లు దండుకుని, రెండో ఏడాది కూడా జాబ్ క్యాలెండర్‌పై ఊసెత్తకపోవడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.

క్యాలెండర్ కాదు.. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం
గతంలో వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు జాబ్ క్యాలెండర్ పేరుతో యువత చెవుల్లో పూలు పెట్టిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏకంగా “కాలీఫ్లవర్లు పెడుతోంద”ని షర్మిల ఘాటు వ్యాఖ్యలు చేశారు.
“2025 జనవరి 1 నుంచి క్రమం తప్పని జాబ్ క్యాలెండర్ ఎక్కడ? రెండేళ్లలో రెండు జాబ్ క్యాలెండర్ల సంగతి ఏమైంది?” అంటూ ఆమె ప్రశ్నించారు. ఇదిగో అదిగో అంటూ ఊరించడం తప్ప ఉద్యోగాల భర్తీకి స్పష్టమైన షెడ్యూల్ లేదని ఆరోపించారు.

50 లక్షల మంది నిరుద్యోగుల ఎదురుచూపు
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ కోసం ఎదురుచూస్తోందని షర్మిల తెలిపారు. చాలామంది ఉన్నది అమ్ముకుని కోచింగులు తీసుకుంటున్నారని, ఉద్యోగాలు వస్తాయా రావా అన్న తీవ్ర ఆందోళనలో యువత బతుకుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో కలిపి రెండు లక్షలకు పైగా ఖాళీలు ఉన్నట్లు అంచనా ఉందని ఆమె పేర్కొన్నారు.

వెంటనే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక “కొలువులు ఇస్తాం” అని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని షర్మిల డిమాండ్ చేశారు. వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు సంబంధించిన జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ యువత పక్షాన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.
“కూటమి ప్రభుత్వ హామీ జాబ్ క్యాలెండర్ కాదు.. ఇది జోక్ క్యాలెండర్. నిరుద్యోగ బిడ్డలను మోసం చేసిన దగా క్యాలెండర్” అంటూ ఆమె తీవ్ర పదజాలంతో విమర్శలు గుప్పించారు.

ఇవీ చదవండి: Sharmila : మోదీపై షర్మిల ఘాటు విమర్శలు.. ఓట్ చోర్.. గద్దె ఛోడ్!
Sharmila on BJP : నేను కాదు గాంధారి.. మీరే కౌరవులు : షర్మిల ఫైర్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు