HomeTelanganaFancy Number : ఫ్యాన్సీ నంబర్.. ఫ్యాషనా? క్రేజా? హైదరాబాద్‌లో 9999 నంబర్‌కు రూ.18 లక్షలు...

Fancy Number : ఫ్యాన్సీ నంబర్.. ఫ్యాషనా? క్రేజా? హైదరాబాద్‌లో 9999 నంబర్‌కు రూ.18 లక్షలు – ఖైరతాబాద్ RTA వేలంలో రికార్డు ఆదాయం

Fancy Number : తెలంగాణలో ఫ్యాన్సీ వాహన నంబర్ల క్రేజ్ ఏ స్థాయిలో ఉందో మరోసారి రుజువైంది. హైదరాబాద్‌లోని Khairatabad RTA నిర్వహించిన తాజా ఫ్యాన్సీ నంబర్ల వేలంలో రికార్డు ధరలు పలికాయి. ఒక్క రోజులోనే ప్రభుత్వానికి ఏకంగా రూ.43.5 లక్షల ఆదాయం సమకూరడం గమనార్హం.

9999 నంబర్ కోసం హోరాహోరీ పోటీ
ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది TG 09 J 9999 నంబర్. ఈ నంబర్ కోసం వ్యాపారవేత్తలు, సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. చివరకు కీస్టోన్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ రూ.18 లక్షలు వెచ్చించి ఈ ఫ్యాన్సీ నంబర్‌ను సొంతం చేసుకుంది. ఇది ఇటీవల కాలంలో ఖైరతాబాద్ RTA వేలంలో నమోదైన అత్యధిక ధరలలో ఒకటిగా అధికారులు తెలిపారు.

ఇతర నంబర్లకు కూడా భారీ ధరలు
9999తో పాటు ఇతర ఫ్యాన్సీ నంబర్లకూ డిమాండ్ భారీగానే కనిపించింది.
TG 09 K 0006 – అనంతలక్ష్మి కుమారి రూ.7,06,666
TG 09 K 0005 – నేహా అగర్వాల్ రూ.1,89,001
TG 09 J 9909 – సాయి వెంకట్ సునాగ్ పాలడుగు రూ.1,44,999
TG 09 K 0009 – శ్రీనివాస కన్స్ట్రక్షన్స్ రూ.1,00,000
TG 09 K 0001 – ఇషాని కమోడిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.1,00,000
వాహనదారులు తమ అదృష్ట సంఖ్యలు, ప్రత్యేక అంకెలపై చూపిస్తున్న ఆసక్తే ఈ స్థాయి పోటీకి కారణమని రవాణా శాఖ అధికారులు వెల్లడించారు.

9 నెలల్లో రవాణా శాఖకు రూ.5142 కోట్ల ఆదాయం
మరోవైపు 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు రవాణా శాఖకు భారీ ఆదాయం లభించింది. మొత్తం రూ.5142 కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.

లైఫ్ ట్యాక్స్ ద్వారా – రూ.3611 కోట్లు
త్రైమాసిక పన్నులు – రూ.730 కోట్లు
గ్రీన్ ట్యాక్స్ – రూ.57 కోట్లు
వివిధ ఫీజులు – రూ.408 కోట్లు
తనిఖీల ద్వారా – రూ.181 కోట్లు
సర్వీస్ చార్జీలు – రూ.153 కోట్లు
ఈ కాలానికి ప్రభుత్వం నిర్దేశించిన ఆదాయ లక్ష్యం రూ.6165 కోట్లు కాగా, అందులో పెద్ద భాగాన్ని ఇప్పటికే సాధించామని రవాణా శాఖ వెల్లడించింది.

ఫ్యాన్సీ నంబర్ల వేలాలు మాత్రమే కాదు, మొత్తం వాహన రిజిస్ట్రేషన్లు, పన్నుల వసూళ్లలోనూ తెలంగాణ రవాణా శాఖ మంచి పురోగతి సాధిస్తున్నట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

ఇవీ చదవండి: FASTag: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. ఇక ఆ తలనొప్పి అవసరం లేదు!
Good News : వాహనదారులకు పండుగ గిఫ్ట్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణం? హైదరాబాద్–విజయవాడ హైవేపై తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రతిపాదన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు