HomeNationalFASTag: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. ఇక ఆ తలనొప్పి అవసరం లేదు!

FASTag: వాహనదారులకు కేంద్రం శుభవార్త.. ఇక ఆ తలనొప్పి అవసరం లేదు!

FASTag: కొత్త ఏడాది వేళ ఫాస్టాగ్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం పెద్ద ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు వాహనదారులను ఇబ్బంది పెట్టిన Know Your Vehicle (KYV) ప్రక్రియను రద్దు చేస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల లక్షలాది మంది వాహనదారులకు అనవసరమైన డాక్యుమెంట్ వెరిఫికేషన్, బ్యాంక్ ఫాలోఅప్ సమస్యల నుంచి విముక్తి లభించనుంది.

ఫాస్టాగ్ యాక్టివేషన్ అనంతరం పదే పదే డాక్యుమెంట్లను వెరిఫై చేయాల్సిన పరిస్థితి ఉండేది. ముఖ్యంగా కార్లు, జీపులు, వ్యాన్లు వంటి లైట్ మోటార్ వెహికిల్స్ (LMV) యజమానులు ఈ ప్రక్రియతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు. ఈ నేపథ్యంలో KYV విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని National Highways Authority of India (NHAI) నిర్ణయించింది.

ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయని ఎన్‌హెచ్‌ఏఐ స్పష్టం చేసింది. ఇకపై ఫాస్టాగ్ జారీ సమయంలో వాహనానికి సంబంధించిన పూర్తి వివరాలు సమర్పించి ప్రీ-యాక్టివేషన్ చేయడం తప్పనిసరి. ఒకసారి ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తర్వాత మళ్లీ KYV వెరిఫికేషన్ అవసరం లేదని అధికారులు తెలిపారు.

అలాగే ఇప్పటికే కార్లకు జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా ఇకపై KYV ప్రక్రియ వర్తించదని స్పష్టం చేశారు. అయితే ఫాస్టాగ్ దుర్వినియోగం, తప్పుగా వాహనానికి అనుసంధానం చేసిన సందర్భాల్లో మాత్రమే ప్రత్యేకంగా KYV అవసరం ఉంటుందని తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఫాస్టాగ్ వినియోగిస్తున్న వాహనదారులకు భారీ ఉపశమనం లభించనుంది. ముఖ్యంగా తరచూ జాతీయ రహదారులపై ప్రయాణించే వారికి ఇది నిజంగా శుభవార్తగా మారింది.

ఇవీ చదవండి: Breakfast : బ్రేక్ ఫాస్ట్‌లో బ్రెడ్ మంచిదా? బెస్ట్ బ్రేక్ ఫాస్ట్ టాప్ 5 ఐటమ్స్
Good News : వాహనదారులకు పండుగ గిఫ్ట్.. సంక్రాంతికి టోల్ ఫ్రీ ప్రయాణం? హైదరాబాద్–విజయవాడ హైవేపై తెలంగాణ ప్రభుత్వ కీలక ప్రతిపాదన

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు