HomeCinemaTamannah : ఆఫర్స్ కాదు.. డిమాండ్ టాప్ గేర్! 6 నిమిషాలకు రూ.6 కోట్లా? తమన్నా...

Tamannah : ఆఫర్స్ కాదు.. డిమాండ్ టాప్ గేర్! 6 నిమిషాలకు రూ.6 కోట్లా? తమన్నా సంచలనం!

Tamannah : తెలుగు సినిమా రంగంలో తక్కువ సమయంలోనే స్టార్‌డమ్ అందుకున్న హీరోయిన్లు చాలామందే ఉన్నారు. అయితే కాలం మారినా, ట్రెండ్స్ మారినా తన మార్కెట్‌ను నిలబెట్టుకుని కొనసాగుతున్న కొద్దిమందిలో మిల్కీ బ్యూటీ తమన్నా ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఇండస్ట్రీలో కొనసాగుతూ, ఇప్పటికీ తన డిమాండ్‌తో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

శ్రీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన Tamannaah Bhatia, ఆ తర్వాత Happy Days వంటి సూపర్ హిట్‌తో కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఆ సినిమా తర్వాత ఆమె ప్రయాణం వేగం పెరిగింది. తెలుగు మాత్రమే కాకుండా తమిళంలోనూ స్టార్ హీరోల సరసన అవకాశాలు దక్కించుకుని టాప్ హీరోయిన్‌గా ఎదిగింది. సౌత్ నుంచి నార్త్ వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను తన గ్లామర్, నటనతో మెప్పించింది.

కాలక్రమంలో పరిస్థితులు మారాయి. ప్రస్తుతం మెయిన్ హీరోయిన్‌గా లీడ్ రోల్స్ తగ్గినా, తమన్నా మార్కెట్ మాత్రం ఏమాత్రం తగ్గలేదని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల కాలంలో ఆమె స్పెషల్ సాంగ్స్‌తోనే ట్రెండ్ సెట్ చేస్తోంది. ముఖ్యంగా Jailer సినిమాలోని ‘కావాలయ్యా’ పాటతో దేశవ్యాప్తంగా క్రేజ్ మరింత పెరిగింది. ఆ తర్వాత హిందీలో చేసిన స్పెషల్ సాంగ్స్ కూడా సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి.

ఇటీవల ‘రైడ్ 2’ సినిమాలో చేసిన స్పెషల్ సాంగ్‌కు గానూ సుమారు రూ.5 కోట్ల వరకు పారితోషికం అందుకున్నట్లు టాక్ వినిపించింది. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, తమన్నా డిమాండ్ మరింత పెరిగిందని సమాచారం. తాజాగా ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతున్న వార్తల ప్రకారం, గోవాలో జరిగిన ఓ ఈవెంట్‌లో కేవలం 6 నిమిషాల డ్యాన్స్ పెర్ఫార్మెన్స్‌కు రూ.6 కోట్లు తీసుకుందట. ఈ న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.

సినిమాల్లో ఆఫర్స్ తగ్గినా, స్టేజ్ షోస్, స్పెషల్ సాంగ్స్, ఈవెంట్స్ ద్వారా భారీగా సంపాదించగలగడం తమన్నాకే చెల్లుతుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. సినిమాలు లేకపోయినా డిమాండ్ తగ్గని స్టార్ అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మొత్తానికి, తమన్నా పేరు పలికితే మార్కెట్ కదలాల్సిందేనని మరోసారి రుజువైంది.

ఇవీ చదవండి: Tamannaah Bhatia: ముడతలేని, నేచురల్ గ్లోయింగ్ స్కిన్‌కు మిల్కీ బ్యూటీ తమన్నా ఫాలో అయ్యే సీక్రెట్ ఇదే!
Tamannah Bhatia : మైసూరు శాండిల్ తెచ్చిన తంటా.. తమన్నాపై విమర్శలు!
Tamannaah Bhatia Video: పింక్ లెహంగాలో తమన్నా మెరుపులు.. హాట్ వీడియో వైరల్
Tamannah item song: తమన్నా ఐటమ్‌ సాంగ్‌.. ఏఐ వెర్షన్‌లో ఎలా ఉంటుందంటే.. కట్టిపడేస్తున్న వీడియోలు!

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు