Tollywood & Bollywood: సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు కథానాయికలుగా మెరిసిన చాలామంది నటీమణులు పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్‌బై చెప్పారు. కొందరు మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెడుతూ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, మరికొందరు మాత్రం పూర్తిగా గ్లామర్ ప్రపంచానికి దూరమయ్యారు. అయితే వీటన్నిటికీ భిన్నంగా… కొందరు స్టార్ హీరోయిన్లు మాత్రం పెళ్లి అనే బంధానికి దూరంగా ఉంటూనే, సింగిల్ లైఫ్‌ను పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారు.
ప్రత్యేకంగా 90ల కాలంలో అందం, అభినయంతో ప్రేక్షకుల మనసులు గెలిచిన పలువురు తారలు ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా స్వతంత్ర జీవితం గడుపుతున్నారు. 50 ఏళ్లు దాటినా కూడా పెళ్లి గురించి ఆలోచించకుండా తమ కెరీర్, వ్యక్తిగత జీవితాన్ని తమకు నచ్చిన విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇంతకీ అలాంటి స్టార్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
సుస్మితా సేన్
మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించిన Sushmita Sen ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు. వివాహ బంధంలోకి అడుగుపెట్టకపోయినా, ఇద్దరు పిల్లలను దత్తత తీసుకుని తల్లిగా తన బాధ్యతలను నిర్వర్తిస్తూ ఆదర్శంగా నిలిచారు.
టబు
సహజ నటనకు కేరాఫ్ అడ్రస్‌గా పేరొందిన Tabu కూడా ఇప్పటికీ సింగిల్‌గానే ఉన్నారు. 54 ఏళ్ల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటూ, పాత్రకు ప్రాధాన్యం ఉన్న సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
తనీషా ముఖర్జీ
కాజోల్ సోదరిగా, అజయ్ దేవగన్ వదినగా గుర్తింపు పొందిన Tanisha Mukherjee కూడా పెళ్లికి దూరంగా ఉంటున్నారు. బిగ్‌బాస్ సహా పలు సినిమాలు, రియాలిటీ షోలలో కనిపించిన ఆమె ప్రస్తుతం 48 సంవత్సరాల వయసులో సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.
షమితా శెట్టి
నటి శిల్పా శెట్టి సోదరిగా గుర్తింపు తెచ్చుకున్న Shamita Shetty కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. తెలుగులోనూ పలు చిత్రాల్లో నటించిన ఆమె వయసు ప్రస్తుతం 46 సంవత్సరాలు.
అమీషా పటేల్
మహేష్ బాబుతో కలిసి ‘నాని’ సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన Amisha Patel కూడా పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే జీవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె వయసు 50 సంవత్సరాలు.
నగ్మా
ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగొందిన Nagma కూడా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ, వ్యక్తిగత జీవితాన్ని ప్రశాంతంగా కొనసాగిస్తున్నారు.
సితార
90లలో తెలుగు సినిమాల్లో మంచి గుర్తింపు పొందిన నటి Sitara కూడా వివాహ బంధంలోకి అడుగుపెట్టకుండా సింగిల్ లైఫ్‌ను కొనసాగిస్తున్నారు.
మొత్తానికి, పెళ్లి అనేది జీవితం లో తప్పనిసరి కాదు అనే విషయాన్ని ఈ హీరోయిన్లు తమ జీవితాలతోనే నిరూపిస్తున్నారు. స్వతంత్రత, ఆత్మవిశ్వాసం, కెరీర్ పట్ల కమిట్‌మెంట్‌తో సింగిల్ లైఫ్ కూడా ఎంతో హ్యాపీగా ఉండొచ్చని చెప్పే లైవ్ ఎగ్జాంపుల్స్ వీళ్లే.
ఇవీ చదవండి: Cinema 2025 : ఈ ఏడాది వచ్చిన హిట్లు, ప్లాపులు, కలెక్షన్లు, కాంట్రవర్సీలు.. టాలీవుడ్ రివైండ్ 2025
Radhakishan Damani: తండ్రి చనిపోవడంతో చదువుకు ఫుల్ స్టాప్.. తర్వాత వ్యాపారంలోకి.. నేడు దేశంలోనే 6వ ధనవంతుడు!
