Viral Video: సోషల్ మీడియాలో రోజుకో వింత వీడియో వైరల్ అవుతూనే ఉంటుంది. కానీ ఇది మాత్రం చూసిన వారిని షాక్‌కు గురి చేస్తోంది. సాధారణంగా అమ్మాయిల కోసం అబ్బాయిలు గొడవపడటం కామన్. కానీ ఇక్కడ మాత్రం ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలే నడిరోడ్డుపై జుట్టు పట్టుకుని కొట్టుకోవడం నెటిజన్లను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
“ఇదెక్కడి ఇచ్చంత్రం మావా.. ఇలాంటిది ఎక్కడా చూడలేదు” అంటూ ఈ వీడియోపై నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘వాడు నావాడే’ అంటూ ఇద్దరు అమ్మాయిలు పరస్పరం దాడి చేసుకుంటూ రోడ్డుపై రచ్చ చేయడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.
వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ ప్రాంతంలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. వీడియోలో కనిపిస్తున్న యువకుడి పేరు అభిషేక్‌గా చెబుతున్నారు. అతడు కొంతకాలంగా ఓ యువతితో ప్రేమలో ఉన్నాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారని సమాచారం. ఆ తర్వాత అభిషేక్ మరో అమ్మాయితో ప్రేమాయణం ప్రారంభించాడు.
ఇదే సమయంలో అతడి మాజీ ప్రియురాలు మళ్లీ అభిషేక్‌తో క్లోజ్‌గా మూవ్ అవుతూ, పాత అలవాటు ప్రకారం ప్రేమగా “బాబు” అని పిలవడం ప్రారంభించిందట. ఈ విషయం కొత్త ప్రియురాలికి తెలియడంతో ఆమెకు కోపం తారస్థాయికి చేరింది.
యశోదా నగర్ బైపాస్ వద్ద రాత్రి వేళ ఈ ఇద్దరు అమ్మాయిలు ఎదురుపడ్డారు. మొదట మాటల తూటాలు పేలాయి. క్షణాల్లోనే ఆ గొడవ తీవ్రస్థాయికి చేరి, జుట్టు పట్టుకుని కొట్టుకునే స్థితికి వెళ్లింది.
“నువ్వు వదిలేసిన వాడే ఇప్పుడు నావాడు. నువ్వు ఇంకా బాబు అని పిలుస్తావా?” అంటూ కొత్త ప్రియురాలు మాజీ ప్రియురాలిపై దాడి చేసినట్లు వీడియోలో కనిపిస్తోంది.
ఈ మొత్తం ఘటనను అక్కడ ఉన్నవారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్లు సమాచారం.
ఈ వీడియోపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.
“వ్యక్తిగత విషయాలను ఇలా రోడ్డు మీదకు తీసుకురావడం అవసరమా?”,
“ఇలాంటి గొడవలు సమాజానికి ఏం సందేశం ఇస్తాయి?” అంటూ ఇద్దరు అమ్మాయిల ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ చదవండి: Cricket Viral: గ్రౌండ్‌లో క్యాచ్ పడితే.. బ్యాంక్‌లో కోట్లు! అదృష్టం అంటే ఈ కుర్రాడిదే!
Viral Video: కారులో ఊపిరాడక అల్లాడిన పసికందు.. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన NYPD డిటెక్టివ్
