HomeInternationalViral Video: కారులో ఊపిరాడక అల్లాడిన పసికందు.. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన NYPD డిటెక్టివ్

Viral Video: కారులో ఊపిరాడక అల్లాడిన పసికందు.. సమయస్ఫూర్తితో ప్రాణాలు కాపాడిన NYPD డిటెక్టివ్

Viral Video: యూఎస్‌లో చోటుచేసుకున్న ఓ హృదయాన్ని కదిలించే ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. న్యూయార్క్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌కి (NYPD) చెందిన ఓ డిటెక్టివ్, రద్దీ ట్రాఫిక్ మధ్య కారులో ఊపిరాడక ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందును సమయస్ఫూర్తితో రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెటిజన్లను భావోద్వేగానికి గురిచేస్తోంది.

న్యూయార్క్ నగరంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో, ఎమర్జెన్సీ షోల్డర్ లేన్‌లో వేగంగా వెళ్తున్న ఓ నల్లటి BMW కారును NYPD డిటెక్టివ్ ఫస్ట్ గ్రేడ్ మైఖేల్ గ్రీనీ గమనించాడు. అసాధారణంగా వేగంగా కారు వెళ్తుండటంతో అనుమానం వచ్చిన గ్రీనీ వెంటనే తన పోలీస్ వాహనంలోని లైట్లు ఆన్ చేసి ఆ కారును ఆపాడు.

కారు ఆపిన వెంటనే లోపల నుంచి ఓ తండ్రి ఆందోళనతో అరుస్తూ బయటకు వచ్చాడు. తన చిన్నారి ఊపిరి తీసుకోలేక ఉక్కిరిబిక్కిరి అవుతోందని అతడు చెప్పాడు. పరిస్థితి తీవ్రతను గ్రహించిన డిటెక్టివ్ గ్రీనీ ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా కారు వైపు పరుగెత్తాడు.

వైరల్ అవుతున్న వీడియోలో, గ్రీనీ ఆ పసికందును కారు నుంచి బయటకు తీసి, ఆమె వీపుపై నెమ్మదిగా కానీ సమర్థవంతంగా కొట్టి గొంతులో అడ్డుకుపోయిన అవరోధాన్ని తొలగించినట్లు కనిపిస్తుంది. కొన్ని క్షణాల తర్వాత శిశువు మళ్లీ ఊపిరి పీల్చుకోవడం ప్రారంభించింది. ఆ దృశ్యం అక్కడ ఉన్నవారితో పాటు వీడియో చూసిన నెటిజన్లను కూడా కన్నీళ్లకు గురిచేసింది.

తన కూతురు ప్రస్తుతం పూర్తిగా సురక్షితంగా ఉందని ఆ చిన్నారి తండ్రి తరువాత పోలీసులకు తెలిపాడు. ఈ ఘటనలో డిటెక్టివ్ గ్రీనీ చూపిన ధైర్యం, అనుభవం, సమయస్ఫూర్తి వల్లే ఒక పసికందు ప్రాణాలతో బయటపడిందని అందరూ కొనియాడుతున్నారు.

17 ఏళ్లుగా NYPDలో సేవలందిస్తున్న మైఖేల్ గ్రీనీ చేసిన ఈ సాహసకార్యంపై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది. “ఇలాంటి పోలీసులే నిజమైన హీరోలు”, “యూనిఫామ్‌లో ఉన్న దేవుడు” అంటూ నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు.

ఇవీ చదవండి: Watch Video: సభలో లేడీ డాక్టర్‌ హిజాబ్‌ లాగిన సీఎం నితీశ్‌ కుమార్‌.. వీడియో వైరల్, రాజకీయ దుమారం
Hardik Pandya : భారత్ ఓటమి తర్వాత గంభీర్–హార్దిక్ మధ్య మాటల యుద్ధం? వైరల్ వీడియో

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు