HomeAndhra PradeshAnantapur Crime : చర్మవ్యాధి–ఒబేసిటీ మందుల మోతాదు పెరిగి.. ఎస్కే యూనివర్సిటీ విద్యార్థిని మృతి

Anantapur Crime : చర్మవ్యాధి–ఒబేసిటీ మందుల మోతాదు పెరిగి.. ఎస్కే యూనివర్సిటీ విద్యార్థిని మృతి

Anantapur Crime : అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. చర్మవ్యాధి చికిత్సతో పాటు ఒబేసిటీ తగ్గించుకునేందుకు తీసుకున్న మందుల మోతాదు అధికమై, ఓ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనతో తల్లిదండ్రులు, స్నేహితులు తీవ్ర శోకంలో మునిగిపోయారు.

నందికొట్కూరుకు చెందిన మాధుర్య, Sri Krishnadevaraya Universityలో ఎమ్మెస్సీ సెకండ్ ఇయర్ చదువుతోంది. చదువు నిమిత్తం ఆమె యూనివర్సిటీ హాస్టల్‌లో ఉంటోంది. గత కొంతకాలంగా చర్మ సమస్యకు చికిత్స తీసుకుంటూనే, ఒబేసిటీ కారణంగా బరువు తగ్గేందుకు కూడా మందులు వాడుతున్నట్లు సమాచారం.

ఇటీవల మాధుర్యకు ఫిట్స్ రావడంతో హాస్టల్ సిబ్బంది వెంటనే ఆమెను Anantapur ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రాథమికంగా చర్మవ్యాధి, ఒబేసిటీకి వాడిన మందుల డోస్ అధికమవ్వడం వల్ల గుండె సంబంధిత సమస్యలు, ఫిట్స్ వచ్చి మృతి చెందినట్లుగా వైద్యులు భావిస్తున్నారు.

మాధుర్య ఆకస్మిక మరణంతో యూనివర్సిటీ విద్యార్థులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె ఎక్కడ చికిత్స తీసుకుంటోంది? ఏ మందులు వాడుతోంది? వేర్వేరు మందుల కలయిక ప్రమాదకరంగా మారిందా? అనే కోణాల్లో పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత లోతైన దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: Andhra Pradesh: సీమపై ఎందుకీ కక్ష? లా యూనివర్సిటీ, కొప్పర్తి అమరావతికి షిఫ్టింగ్! 
Telangana Crime : అక్క వరుసయ్యే మహిళతో వివాహేతర బంధం.. చివరకు భర్త చేతిలో ఏమైందంటే..

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు