Tanaya Sachdeva : అందం, అభినయం విషయంలో స్టార్ హీరోయిన్స్‌కే ఏమాత్రం తీసిపోని ఈ భామను గుర్తుపట్టారా? 2015లో విడుదలైన దోచేయ్ సినిమాలో నాగ చైతన్య చెల్లెలుగా కనిపించిన లలితా క్యారెక్టర్ గుర్తుందా? అప్పట్లో ఆ పాత్రతో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ అమ్మడు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది.
Tanaya Sachdeva : అక్కినేని వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాగచైతన్య ఎప్పుడూ వైవిధ్యమైన కథలకే ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అలాంటి ప్రయోగాత్మక సినిమాల్లో ‘దోచేయ్’ ఒకటి. బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితం అందుకోలేకపోయినా, చైతూను కొత్త కోణంలో చూపించిన సినిమా ఇది. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ హీరోయిన్‌గా నటించగా, చైతూకు చెల్లెలిగా నటించిన లలితా పాత్రకు మంచి స్పందన వచ్చింది.
అయితే ఆ లలితా పాత్రలో నటించిన అమ్మాయి ఎవరో తెలుసా? ఆమె మరెవరో కాదు… తనయ సచ్‌దేవా. ముంబైలో పుట్టి పెరిగిన తనయ, సినిమాల్లోకి రావడానికి ముందు మోడలింగ్ ద్వారా పలు ప్రముఖ యాడ్స్‌లో కనిపించింది. ఆ తర్వాత ‘కహి సుని’ అనే టీవీ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో ‘పరచేడ్’ అనే బోల్డ్ మూవీతో బీ-టౌన్‌కు పరిచయమైన ఆమె, తెలుగులో ‘దోచేయ్’తో ఎంట్రీ ఇచ్చింది.
సినిమాలతో పాటు ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్, అలాగే OPS, Love Scandals & Doctors వంటి వెబ్ సిరీస్‌లలో నటిస్తూ తనయ ప్రేక్షకులకు దగ్గరైంది. నటనతో పాటు గ్లామర్ విషయంలోనూ ఏమాత్రం తగ్గకుండా సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ, లేటెస్ట్ ఫోటోషూట్స్‌తో కుర్రాళ్లకు టెంపరేచర్ పెంచుతోంది.
ఇంత అందం, టాలెంట్ ఉన్నప్పటికీ తనయకు పెద్దగా అవకాశాలు ఎందుకు రావడం లేదని నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె షేర్ చేసిన తాజా ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ హాట్ టాపిక్‌గా మారాయి. మరి ఈ హీరోయిన్ మెటీరియల్ ఉన్న భామను టాలీవుడ్ ఎప్పుడు పూర్తిస్థాయిలో వినియోగించుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి: Bigg Boss 9 Telugu Updates: సామాన్యుడికే పట్టం! బిగ్ బాస్ విన్నర్‌గా కళ్యాణ్ పడాల
Tollywood : నాగార్జున, బాలకృష్ణతో హిట్స్ ఇచ్చిన హీరోయిన్.. పదేళ్ల తర్వాత తెలుగులో రీఎంట్రీ!
