MS Dhoni : టాలీవుడ్‌లో హాట్‌నెస్‌కు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు తెచ్చుకున్న నటి రాయ్ లక్ష్మి మరోసారి వార్తల్లో నిలిచారు. హీరోయిన్‌గా నటిస్తూనే స్పెషల్ సాంగ్స్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన ఈ గ్లామర్ బ్యూటీ.. ఇప్పుడు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కెరీర్ ఆరంభంలో యాడ్స్‌లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న రాయ్ లక్ష్మి.. 2005లో తమిళ చిత్రం కర్క కసదరతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. అదే ఏడాది కన్నడ చిత్రం వాల్మీకిలో శివరాజ్‌కుమార్ సరసన నటించి మంచి పేరు సంపాదించింది. అనంతరం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంది.
తెలుగులో కంచనమాల కేబుల్ టీవీ, నీలి మేఘం, బలుపు వంటి సినిమాల్లో నటించిన ఈ వయ్యారి భామ.. హీరోయిన్ పాత్రలకన్నా స్పెషల్ సాంగ్స్‌తోనే ఎక్కువ పాపులారిటీ సంపాదించింది.
పవన్ కళ్యాణ్, చిరంజీవి, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోలతో స్టెప్పులేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇటీవల సినిమాల స్పీడ్ తగ్గించిన రాయ్ లక్ష్మి.. తన వ్యక్తిగత జీవితం గురించి చేసిన వ్యాఖ్యలతో మరోసారి చర్చకు వచ్చింది. గతంలో స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనితో తనకు ఉన్న రిలేషన్‌షిప్‌పై ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ధోనితో తనకు ఉన్న గత సంబంధాన్ని రాయ్ లక్ష్మి “నా జీవితంలో ఒక మచ్చ”గా అభివర్ణించడం సంచలనంగా మారింది. భవిష్యత్తులో తన పిల్లలు ఈ విషయం గురించి ప్రశ్నిస్తే తాను ఎలా సమాధానం చెప్పాలోనన్న ఆందోళనను కూడా ఆమె వ్యక్తం చేసింది. అంతేకాదు, చాలా కాలం గడిచిపోయినా ధోనితో తనకు ఉన్న రిలేషన్‌పై ఇంటర్నెట్‌లో ఇప్పటికీ వార్తలు వైరల్ అవుతుండటంపై అసహనం వ్యక్తం చేసింది.
“గతంలో జరిగిన విషయాలను మళ్లీ మళ్లీ తవ్వి తీస్తూ ప్రచారం చేయడం బాధగా ఉంది. ఈ పిచ్చి ప్రచారానికి ఇకైనా ముగింపు పలకాలి” అంటూ రాయ్ లక్ష్మి వ్యాఖ్యానించినట్లు సమాచారం.
ఈ వ్యాఖ్యలతో రాయ్ లక్ష్మి మరోసారి సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి: Dhoni Relation : మహేంద్రసింగ్ ధోనితో రిలేషన్.. నటి సంచలన వ్యాఖ్యలు!
MS Dhoni : మైదానంలో ఫినిషర్.. తెరపై యాక్షన్ హీరో.. ధోని కొత్త అవతారం!
