IPL 2026 : ఐపీఎల్ 2026 మినీ వేలం ఈసారి అనేక సంచలనాలకు వేదికగా నిలిచింది. విదేశీ ప్లేయర్ల కోటాలో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ ఏకంగా రూ.25.20 కోట్ల ధర పలికి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదే వేలంలో ఇద్దరు దేశీ అన్‌క్యాప్డ్ ప్లేయర్లు కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ చెరో రూ.14.20 కోట్లకు అమ్ముడవడం కూడా హాట్ టాపిక్‌గా మారింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ.25.20 కోట్లు వెచ్చించి కామెరాన్ గ్రీన్‌ను సొంతం చేసుకుంది. ఆ జట్టు ఆండ్రీ రస్సెల్‌ను విడుదల చేయడంతో, అతడి స్థానంలో ఆల్‌రౌండర్ కోటాను గ్రీన్‌తో భర్తీ చేయనుంది. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది.
వేలంలో రూ.25.20 కోట్లకు అమ్ముడైనా.. కామెరాన్ గ్రీన్ ఇంటికి తీసుకెళ్లేది కేవలం రూ.9.74 కోట్లు మాత్రమే! ఇంతకీ ఇది ఎలా సాధ్యమైంది..? కారణం ఏమిటంటే..
కారణం ఇదే.. ఐపీఎల్ నిబంధనలు
ఐపీఎల్ నిబంధనల ప్రకారం, మినీ వేలంలో విదేశీ ఆటగాడు ఎంత ధర పలికినా గరిష్టంగా రూ.18 కోట్లు మాత్రమే ఫీజుగా పొందగలడు.
లేదంటే, మెగా వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడి (రిషబ్ పంత్ – రూ.27 కోట్లు) ధరను మించకూడదు.
అందువల్ల కామెరాన్ గ్రీన్‌కు రీటెయినింగ్ ఫీజుగా రూ.18 కోట్లు మాత్రమే లభిస్తాయి. మిగిలిన రూ.7.20 కోట్లు BCCIకి PWF (Player Welfare Fund) కింద చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని బీసీసీఐ ఆటగాళ్ల సంక్షేమానికి వినియోగించనుంది.
ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ రూ.18 కోట్లలో నుంచి కూడా భారీగా కోత పడుతుంది.
భారత్‌లో పన్నుల కోత
రూ.18 కోట్లలో నుంచి భారతీయ పన్నులు ఇలా కట్ అవుతాయి:
టీడీఎస్: రూ.3.60 కోట్లు
సర్‌ఛార్జ్: రూ.90 లక్షలు
సెస్: రూ.18 లక్షలు
ఈ కోతల తర్వాత గ్రీన్ చేతికి మిగిలేది రూ.13.32 కోట్లు మాత్రమే.
ఆస్ట్రేలియా ట్యాక్స్ షాక్!
ఇక్కడితో కథ ముగియదు. ఆస్ట్రేలియాలో కూడా గ్రీన్ ఆదాయంపై పన్నులు వర్తిస్తాయి.
ఆస్ట్రేలియా ఇన్‌కమ్ ట్యాక్స్: రూ.7.90 కోట్లు
మెడికేర్ లెవీ: రూ.36 లక్షలు
ఫారిన్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫ్‌సెట్: రూ.4.68 కోట్లు
ఈ అన్ని డిడక్షన్లు పోనూ.. చివరికి కామెరాన్ గ్రీన్ ఇంటికి తీసుకెళ్లేది కేవలం రూ.9.74 కోట్లు మాత్రమే.
నెటిజన్ల ఆశ్చర్యం!
వేలంలో కోట్లకు కోట్లు పలికిన ఆటగాడికి, అన్ని పన్నులు, డిడక్షన్లు పోగా చేతికి వచ్చే మొత్తం ఇంత తక్కువగా ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. “కోట్ల డీల్ కనిపిస్తే కోట్ల జీతం అనుకుంటాం.. కానీ అసలు లెక్క ఇదా!” అంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
ఇవీ చదవండి: IPL 2026: అత్యధిక ధర పలుకుతాడనుకున్నాడు.. కానీ ఓ చిన్న మిస్టేక్‌తో వేలంలో ఆశలకు బ్రేక్?
IPL 2026 Auction: వైభవ్ సూర్యవంశీకి మించిన హైప్.. ఐపీఎల్ 2026లో విధ్వంసానికి సిద్ధమైన రూ.14 కోట్ల యువ సంచలనాలు!
