CAT 2026 Result Date: కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT) 2026కు సంబంధించిన తుది ఆన్సర్ కీని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ (IIM) కోజికోడ్ తాజాగా విడుదల చేసింది. ఇప్పటికే తాత్కాలిక ఆన్సర్ కీని విడుదల చేసిన ఐఐఎం, డిసెంబర్ 8 నుంచి 10 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించింది.
మొత్తం మూడు షిఫ్టుల్లో నిర్వహించిన క్యాట్ పరీక్షకు సంబంధించి 187 అభ్యంతరాలు అందగా, వాటిలో ఒక్క అభ్యంతరాన్ని మాత్రమే ఆమోదించినట్లు ఐఐఎం కోజికోడ్ వెల్లడించింది. అభ్యంతరాల పరిశీలన అనంతరం ఫైనల్ ఆన్సర్ కీని రూపొందించి అధికారికంగా విడుదల చేసింది.
ఇక CAT 2026 ఫలితాలను జనవరి మొదటి వారంలో విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం. ఫలితాలు వెలువడిన తర్వాత అభ్యర్థులు తమ స్కోర్‌కార్డులను అధికారిక వెబ్‌సైట్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
కాగా దేశవ్యాప్తంగా 170 నగరాల్లో నవంబర్ 30న క్యాట్ 2026 పరీక్షను పూర్తిగా ఆన్‌లైన్ (CBT) విధానంలో నిర్వహించిన సంగతి తెలిసిందే. క్యాట్‌లో సాధించిన పర్సంటైల్ ఆధారంగానే ఐఐఎంలలో సీట్ల కేటాయింపు జరుగుతుంది. అంతేకాకుండా క్యాట్ స్కోర్‌తో దేశవ్యాప్తంగా ఉన్న పలు ప్రముఖ మేనేజ్‌మెంట్ కాలేజీల్లోనూ ప్రవేశాలు లభిస్తాయి.
ICAI CA January 2026 Admit Cards: అడ్మిట్ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్ ఇదే
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) జనవరి 2026లో నిర్వహించనున్న CA పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేసింది.
CA ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ eservices.icai.org ద్వారా తమ రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ICAI విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం, CA జనవరి 2026 పరీక్షలు జనవరి 5 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. పరీక్షల తేదీలు, పరీక్ష కేంద్ర వివరాలు అడ్మిట్ కార్డులో స్పష్టంగా పొందుపరిచారు. అభ్యర్థులు పరీక్షకు వెళ్లే ముందు హాల్ టికెట్‌ను తప్పనిసరిగా ప్రింట్ తీసుకుని వెళ్లాలని ICAI సూచించింది.
ఇవీ చదవండి: UGC NET 2025 Exam Dates: యూజీసీ నెట్ డిసెంబర్ 2025 సబ్జెక్ట్‌వైజ్ పరీక్షల షెడ్యూల్ విడుదల
APPSC Exam Schedule 2026: ఏపీపీఎస్సీ విడుదల చేసిన 21 నోటిఫికేషన్‌లకు పరీక్షల పూర్తి షెడ్యూల్
