HomeAstrologyVastu Tips: అమావాస్య రోజున కొత్త చీపురు కొనొచ్చా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన...

Vastu Tips: అమావాస్య రోజున కొత్త చీపురు కొనొచ్చా? లక్ష్మీదేవి అనుగ్రహం కోసం తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన నియమాలు

Vastu Tips: ఇంటి ఆనందం, శ్రేయస్సు, ఆర్థిక స్థిరత్వానికి వాస్తు శాస్త్రం ఎంతో ప్రాముఖ్యత ఇస్తుంది. ఇంటి నిర్మాణంతో పాటు, ఇంట్లో వాడే వస్తువుల వాస్తు సరిగా ఉంటే ఆ ఇంట్లో మానసిక ప్రశాంతత, సిరి సంపదలు నిలకడగా ఉంటాయని నమ్మకం. అందుకే లక్ష్మీదేవికి ప్రతీకగా భావించే చీపురు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం చేయకూడదని వాస్తు పండితులు సూచిస్తున్నారు.

హిందూ సంప్రదాయంలో చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. ఇంటిని శుభ్రం చేసి, నెగటివ్ ఎనర్జీని తొలగించే చీపురు వల్లే ఇల్లు పవిత్రంగా ఉంటుంది. శుభ్రమైన ఇంట్లోనే లక్ష్మీదేవి నివసిస్తుందని జ్యోతిష్యం, వాస్తు శాస్త్రం చెబుతున్నాయి. కాబట్టి చీపురును సరిగ్గా ఉపయోగించడం, గౌరవంగా ఉంచడం వల్ల ఇంట్లో సంపద, సుఖశాంతులు పెరుగుతాయి.

అయితే చీపురును అవమానించడం, తలకిందులుగా ఉంచడం, ఎక్కడపడితే అక్కడ పెట్టడం వంటివి చేస్తే లక్ష్మీదేవి కృప తగ్గి దరిద్రం దరిచేరుతుందని విశ్వాసం. అందుకే చీపురుకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను తప్పనిసరిగా పాటించాలని పండితులు చెబుతున్నారు.

చీపురు ఏ రోజు కొనాలి?
వాస్తు శాస్త్రం ప్రకారం మంగళవారం, గురువారం, శుక్రవారం, శనివారం కొత్త చీపురు కొనడానికి శుభదినాలు.
అలాగే ధన త్రయోదశి, దీపావళి వంటి పండుగ రోజుల్లో చీపురు కొనడం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభించి, ఆర్థిక సమస్యలు తొలగి ఇంట్లో సానుకూల శక్తి పెరుగుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

అమావాస్య రోజు చీపురు కొనవచ్చా?

అమావాస్య రోజున చీపురు కొనవచ్చా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం సాధారణ అమావాస్య రోజున చీపురు కొనడం మంచిది కాదని పండితులు సూచిస్తున్నారు. అయితే కృష్ణ పక్షంలో అమావాస్యకు దగ్గరగా కొనడం కొంతవరకు అనుకూలంగా ఉంటుందని చెబుతున్నారు. సాధారణ అమావాస్య రోజున కొనడం వల్ల లక్ష్మీదేవి కృప తగ్గి ఆర్థిక నష్టాలు వచ్చే అవకాశం ఉందని వాస్తు విశ్వాసం.

చీపురును ఇంట్లో ఎక్కడ ఉంచాలి?

చీపురును కొనడమే కాకుండా ఇంట్లో సరైన దిశలో ఉంచడం కూడా చాలా ముఖ్యం.
వాస్తు ప్రకారం చీపురును

దక్షిణ దిక్కు
వాయువ్యం
పడమర
నైరుతి దిక్కుల్లో
ఉంచడం శుభకరం.

చీపురును పడుకోబెట్టి, ఎవరికీ కనిపించకుండా ఉంచాలని సూచిస్తున్నారు. ఇలా ఉంచితే ఇంట్లో ఐశ్వర్యం, శ్రేయస్సు, ధనవృద్ధి కలుగుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.

లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలంటే చిన్న విషయాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. చీపురు వంటి సాధారణ వస్తువుకూడా వాస్తు నియమాలతో వాడితే ఇంట్లో సంపద, సుఖశాంతులు పెరుగుతాయి. అందుకే చీపురును కొనడం, ఉపయోగించడం, ఉంచడం విషయంలో ఈ నియమాలను తప్పకుండా పాటించండి.

ఇవీ చదవండి: Vastu Tips: వినాయకుడి పక్కనే లక్ష్మీదేవి ఎందుకు ఉండాలి? వాస్తు ప్రకారం దాగి ఉన్న అసలు లాజిక్!
Goddesses Laxmi and Plants: ఇంట్లో లక్ష్మీదేవిని ఆహ్వానించండి.. మనీ ప్లాంట్‌తోపాటు ఈ మొక్కలు పెంచాలి

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు