Bangladesh Bus Accident: బంగ్లాదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక బస్సు పద్మా నదిలో పడిపోవడంతో కనీసం 16 మంది మరణించగా, పలువురు గల్లంతయ్యారు. ఈద్ పండుగ ముగించుకుని ఢాకాకు తిరిగి వస్తున్న సమయంలో రాజ్‌బారి జిల్లాలోని దౌలత్దియా ఫెరీఘాట్ వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
పద్మా నదిలో పడిన బస్సు
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బంగ్లాదేశ్‌లోని రాజ్‌బారి జిల్లాలో దౌలత్దియా టెర్మినల్ వద్ద ఫెర్రీ ఎక్కే సమయంలో అదుపుతప్పి పద్మా నదిలో పడిపోయింది.
16 మంది మృతి
ప్రమాదం అనంతరం బస్సును క్రేన్ సహాయంతో బయటకు తీయగా ఇప్పటి వరకు 16 మంది మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు.
40 మంది ప్రయాణికులు
బస్సులో మహిళలు, పిల్లలు సహా సుమారు 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. కొంతమంది ఈదుకుంటూ బయటపడగా పలువురు గల్లంతయ్యారు.
భారీ గాలింపు చర్యలు
సైన్యం, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, కోస్ట్ గార్డ్ బృందాలు కలిసి నదిలో గల్లంతైన వారిని గుర్తించేందుకు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.
ప్రమాదంపై దర్యాప్తు ఆదేశాలు
ఈ ఘటనపై బంగ్లాదేశ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.
ఇవీ చదవండి: AP Crime News: జాకెట్ కోసం రక్తపాతం – రెండు కుటుంబాల మధ్య ఘర్షణ, ఇద్దరికి తీవ్ర గాయాలు
Bangladesh Cricket : బంగ్లాదేశ్ క్రికెట్‌కు గడ్డుకాలం: వరల్డ్ కప్‌ల నుంచి నిష్క్రమణ… కోట్ల నష్టం… భవిష్యత్తుపై నీలినీడలు
Bangladesh : బంగ్లాదేశ్‌లో మైనారిటీలపై ఉన్మాద హింస: హిందూ యువకుడిని సజీవ దహనం చేసిన దుండగులు
