HomeAndhra PradeshPulivendula : పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ.. బీటెక్ రవి రాకతో ఊరు ఖాళీ!

Pulivendula : పులివెందులలో టీడీపీకి ఎదురుదెబ్బ.. బీటెక్ రవి రాకతో ఊరు ఖాళీ!

Pulivendula : పులివెందుల నియోజకవర్గంలో టీడీపీకి మరోసారి తీవ్ర నిరసన ఎదురైంది. వైఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం అమ్మగారిపల్లి గ్రామంలో టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్‌రెడ్డి (బీటెక్ రవి) రాక గ్రామాన్ని ఖాళీ చేయించే స్థాయికి దారి తీసింది. గ్రామంలో మూడు కుటుంబాలకు టీడీపీ కండువాలు వేయించేందుకు నాయకులు రావడంతో, గ్రామస్తులంతా స్వచ్ఛందంగా ఇళ్లకు తాళాలు వేసి ఊరు విడిచి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

టీడీపీ నేతల రాకతో గ్రామస్తుల నిరసన

అమ్మగారిపల్లి గ్రామం గత కొన్నేళ్లుగా వైఎస్సార్‌సీపీకి అండగా నిలుస్తూ వస్తోంది. వైఎస్ కుటుంబం వెంటనే నడుస్తున్నామని చెబుతున్న గ్రామస్తులు.. టీడీపీ నాయకులు గ్రామంలో అడుగుపెట్టగానే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. పోలీసుల ఒత్తిళ్లు, ఇబ్బందులు ఉన్నప్పటికీ గ్రామంలో ఉండకుండా ఊరును ఖాళీ చేయడం ద్వారా తమ అసమ్మతిని స్పష్టంగా తెలియజేశారు.

గ్రామస్తులు తమ ఇళ్లకు తాళాలు వేసి సమీపంలోని పెండ్లిమర్రి మండలం నందిమండలం గ్రామం సమీపంలో ఉన్న కొండ గంగమ్మ ఆలయానికి చేరుకుని, అక్కడ వైఎస్సార్‌సీపీకి సంఘీభావంగా ప్రత్యేక విందు ఏర్పాటు చేసుకున్నారు.

ప్రలోభాలు, ఒత్తిళ్లకు తలవంచని ప్రజలు

గ్రామంలోని కొందరిని టీడీపీలోకి చేర్చుకునేందుకు ప్రలోభాలకు పాల్పడినట్టు, ఇందుకు పోలీసులను కూడా వినియోగించినట్టు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోని ప్రజలంతా టీడీపీ కార్యక్రమంలో పాల్గొనాలని ఒత్తిడి తెచ్చారని, అయితే దీనిని ప్రజలు పూర్తిగా తిరస్కరించారని తెలిపారు.

విందు కార్యక్రమానికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా గ్రామస్తులు వెనక్కి తగ్గలేదు. ఈ పరిణామాలతో గ్రామంలో ఒక్కరూ లేకపోవడంతో బీటెక్ రవితో పాటు టీడీపీ నాయకులు అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.

వైఎస్సార్‌సీపీకి ప్రజల మద్దతు స్పష్టం

ఈ ఘటనతో అమ్మగారిపల్లి గ్రామం వైఎస్సార్‌సీపీకి మరోసారి అండగా నిలిచినట్టు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఎలాంటి ఒత్తిళ్లు వచ్చినా వైఎస్సార్‌సీపీలోనే కొనసాగుతామని, వైఎస్ కుటుంబం వెంటే నడుస్తామని గ్రామస్తులు తేల్చిచెప్పారు.

టీడీపీపై సతీష్ రెడ్డి మండిపాటు

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్‌వీ సతీష్‌కుమార్‌రెడ్డి ఈ ఘటనపై స్పందిస్తూ.. “టీడీపీ నాయకులు గ్రామంలోకి రావడంతో ఊరు మొత్తం ఖాళీ చేయడం ప్రజల ఆగ్రహానికి నిదర్శనం. అమ్మగారిపల్లి గ్రామస్తులు చూపిన ధైర్యం వైఎస్సార్‌సీపీకి వెయ్యి ఏనుగుల బలం. పోలీసులను అడ్డం పెట్టుకొని ఒత్తిళ్లు తెచ్చినా ప్రజలు లొంగలేదు” అని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ బలహీనపడుతోందనడానికి ఈ ఘటనే నిదర్శనమని, ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగాలని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆకాంక్షిస్తున్నారని సతీష్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: Jagan Pressmeet : వైఎస్ జగన్ సుదీర్ఘ ప్రెస్ మీట్.. రైతులు, ఆరోగ్యశ్రీ, ఉద్యోగులు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, లడ్డూ, పరకామణి, చంద్రబాబు కేసులు.. 
Satish Reddy : చంద్ర‌బాబు చేసింది శూన్యం.. చెప్పుకునేది ఘ‌నం

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు