HomeInternationalRussia AN 22 : రష్యా రక్షణ వ్యవస్థకు భారీ దెబ్బ – కుప్పకూలిన ప్రపంచంలోనే...

Russia AN 22 : రష్యా రక్షణ వ్యవస్థకు భారీ దెబ్బ – కుప్పకూలిన ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానం An-22

Russia AN 22 : రష్యా రక్షణ వ్యవస్థ మరోసారి పెద్ద షాక్‌కు గురైంది. ప్రపంచంలోనే అతిపెద్ద టర్బోప్రాప్ విమానంగా ప్రసిద్ధి చెందిన An-22 సైనిక రవాణా విమానం రష్యాలో కుప్పకూలింది. రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ఈ భారీ ఎయిర్‌క్రాఫ్ట్‌లో మొత్తం ఏడు మంది సిబ్బంది ఉన్నారు. మాస్కోకు సమీపంలోని ఇవనోవో ప్రాంతం వద్ద ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం.

ప్రాథమిక నివేదికల ప్రకారం విమానం టేకాఫ్ అనంతరం కొద్దిసేపటికే సమస్యలు తలెత్తినట్లు అనుమానం. ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు పరిశీలనలో ఉన్నాయి. రష్యా రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే ఈ విమానం ఇలా కూలిపోవడం పెద్ద నష్టంగా భావిస్తున్నారు.

An-22 – ప్రపంచంలోని అతిపెద్ద టర్బోప్రాప్ విమానం
1960లలో యుక్రెయిన్‌లోని కైవ్‌లో O.K. ఆంటోనోవ్ ఏరోనాటికల్ సైంటిఫిక్ & టెక్నికల్ కాంప్లెక్స్ ఈ మహాకాయాన్ని అభివృద్ధి చేసింది.
ఇది:
60 టన్నుల సరుకు సామర్థ్యం
290 మంది సైనికులను, లేదా
150 మంది పారాట్రూపర్లను

ఒకేసారి మోయగల సామర్థ్యంతో రూపొందించబడింది.
ఇంధన పొదుపు, భారీ లోడును మోయగల శక్తి కారణంగా ఇది సైనిక రవాణాలో కీలక పాత్ర పోషిస్తూ వచ్చింది. ATR-72, Dash-8 వంటి విమానాలు కూడా టర్బోప్రాప్ వర్గానికి చెందినవే.

రష్యాలో ఇటీవల జరిగిన మరికొన్ని విమాన ప్రమాదాలు
రష్యా వైమానిక రంగంలో ఇటీవల నెల్లకొన్న ప్రమాదాల వరస ఆందోళన కలిగిస్తోంది.
సెప్టెంబర్ 4: రియాజాన్ ప్రాంతంలో X-32 బెకాస్ తేలికపాటి విమానం కూలి, పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.

నవంబర్ 2025: కరేలియా ప్రాంతంలో రష్యా వైమానిక దళానికి చెందిన Su-30 ఫైటర్ జెట్ కూలిపోవడంతో ఇద్దరు పైలట్లు మరణించారు.

ఈ వరుస ఘటనలు రష్యా విమాన భద్రతపై పలు ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. తాజా An-22 ప్రమాదంపై పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

ఇవీ చదవండి: Bharat China : భారత్–చైనా మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం: ఢిల్లీ–షాంఘై నాన్-స్టాప్ ఫ్లైట్ త్వరలో
Plane Crash : జార్జియాలో ఘోర విషాదం: కూలిపోయిన టర్కీ C-130 సైనిక విమానం – 20 మంది మరణించినట్లు అనుమానం!
Russian Plane : రష్యాలో విమాన ప్రమాదం.. కొండల్లో శకలాలు.. వీడియో వైరల్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు