December Bank Holidays: డిసెంబర్ నెలలో బ్యాంకు పనులు ఉన్నవారు ముందుగానే షెడ్యూల్ సెట్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ఈసారి డిసెంబర్‌లో దేశవ్యాప్తంగా బ్యాంకులకు మొత్తం 18 సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) విడుదల చేసిన హాలిడే క్యాలెండర్ ప్రకారం ఈ సెలవులు రాష్ట్రానికో, ప్రాంతానికో మారుతూ ఉంటాయి.
నెలలోని ఆదివారాలు నాలుగు, రెండవ & నాల్గవ శనివారాలు కలిపి మొత్తం ఆరు రోజులు సాధారణంగా సెలవులు వస్తాయి. అదనంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పండుగలు, జయంతులు, ప్రత్యేక దినాల కారణంగా మరిన్ని సెలవులు జత అయ్యాయి. క్రిస్మస్ మాత్రం దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సాధారణ సెలవు.
గమనించాల్సిన విషయం ఏమిటంటే—ఈ సెలవులన్నీ ప్రతి రాష్ట్రంలో వర్తించవు. ఆయా రాష్ట్రాల స్థానిక పండుగలు, అవతరణ దినోత్సవాలు, ఆచారాల ఆధారంగా బ్యాంకులు మూసివేయబడతాయి.
డిసెంబర్ 2025 బ్యాంకు సెలవుల పూర్తి జాబితా
డిసెంబర్ 1 (సోమవారం): రాష్ట్ర అవతరణ దినోత్సవం (అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్)
డిసెంబర్ 3 (బుధవారం): సెయింట్ జేవియర్ పండుగ (గోవా)
డిసెంబర్ 7: ఆదివారం సెలవు
డిసెంబర్ 12 (శుక్రవారం): పటోగన్ నెంగ్జింజ సంగ్మా పుణ్యతిథి (మేఘాలయ)
డిసెంబర్ 13: రెండవ శనివారం
డిసెంబర్ 14: ఆదివారం
డిసెంబర్ 18 (గురువారం): ఉసోసో థామ్ పుణ్యతిథి (మేఘాలయ)
డిసెంబర్ 19 (శుక్రవారం): గోవా విముక్తి దినోత్సవం (గోవా)
డిసెంబర్ 20 (శనివారం): లూసూంగ్ – నామ్సూం పండుగ (సిక్కిం)
డిసెంబర్ 21: ఆదివారం
డిసెంబర్ 22 (సోమవారం): లూసూంగ్ – నామ్సూం (సిక్కిం)
డిసెంబర్ 24 (బుధవారం): క్రిస్మస్ ఈవ్ (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)
డిసెంబర్ 25 (గురువారం): క్రిస్మస్ – దేశవ్యాప్త సెలవు
డిసెంబర్ 26 (శుక్రవారం): క్రిస్మస్ స్పెషల్ హాలిడే (మిజోరం, నాగాలాండ్, మేఘాలయ)
డిసెంబర్ 27: నాల్గవ శనివారం
డిసెంబర్ 28: ఆదివారం
డిసెంబర్ 30 (మంగళవారం): యూకియాంగ్ నంగ్బా పుణ్య తిథి (మేఘాలయ)
డిసెంబర్ 31 (బుధవారం): నూతన సంవత్సర వేడుకలు (మిజోరం, మణిపూర్)
బ్యాంకులు మూసి ఉన్నా… ఆన్‌లైన్ సేవలు 24/7 అందుబాటులోనే
బ్యాంకు బ్రాంచ్‌లు సెలవుల కారణంగా మూసిపడినా:
నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్
UPI ట్రాన్సాక్షన్లు
ATM నగదు ఉపసంహరణ
అన్నీ వినియోగదారులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. కానీ చెక్కుల క్లియరెన్స్, RTGS పెద్ద మొత్తాల లావాదేవీలు, డాక్యుమెంట్ సంబంధిత పనుల కోసం బ్రాంచ్‌లకు వెళ్లాల్సి ఉంటుంది.
ఇవీ చదవండి: Bank Merger News: రెండు పెద్ద ప్రభుత్వ బ్యాంకుల విలీనం! కొత్త మెగా ప్లాన్‌పై హల్‌చల్
Collectors Conference : బ్యాంకుల్లో డ్వాక్రా సంఘాల పొదుపు రూ.20,739 కోట్లు
Bank Holidays: సెప్టెంబర్ 2025లో 15 రోజులు బ్యాంకులుండవు!
