HomeLife StyleBreast Milk : దేవుడా..! తల్లిపాలలో యురేనియం గుర్తింపు.. శిశువుల ఆరోగ్యంపై ఆందోళనలు

Breast Milk : దేవుడా..! తల్లిపాలలో యురేనియం గుర్తింపు.. శిశువుల ఆరోగ్యంపై ఆందోళనలు

Breast Milk : బీహార్‌లో ఒక సంచలనాత్మక విషయం వెలుగులోకి వచ్చింది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన బాలింతల తల్లిపాలలో యురేనియం (U-238) ఆనవాళ్లు ఉన్నట్లు శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో బయటపడింది. స్థాయిలు తక్కువగా ఉన్నప్పటికీ, శిశువుల ఆరోగ్యంపై దీర్ఘకాలంలో ప్రతికూల ప్రభావాలు ఉండే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ మాత్రం WHO ప్రమాణాలతో పోలిస్తే ఈ స్థాయిలు ప్రమాదకరం కాదని స్పష్టం చేసింది.

తల్లి పాలలో యురేనియం…ఎలా చేరింది?
నవజాత శిశువుకు తల్లి పాలు అత్యంత సురక్షితమైన ఆహారం. కానీ తాజాగా జరిగిన పరిశోధన మాత్రం భయానక వాస్తవాన్ని చూపిస్తోంది.
అక్టోబర్ 2021 నుండి జూలై 2024 వరకు చేసిన ఒక సమగ్ర అధ్యయనంలో, బీహార్‌లోని భోజ్‌పూర్, సమస్తిపూర్, బెగుసరాయ్, ఖగారియా, కతిహార్, నలందా జిల్లాలకు చెందిన 17–35 సంవత్సరాల వయస్సు గల 40 మంది తల్లుల పాల నమూనాలను పరిశీలించారు.

అన్ని నమూనాల్లో యురేనియం గుర్తింపు
స్థాయిలు: 0 నుంచి 5.25 µg/L వరకు
దాదాపు 70% శిశువులు ఆరోగ్యపరమైన ప్రమాద స్థాయిలో యురేనియంకు గురయ్యే అవకాశం

భూగర్భ జలాల్లో చాలాకాలంగా ఉన్న యురేనియం ఈ సమస్యకు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీటి ద్వారా ఈ విషపూరిత మూలకం పరోక్షంగా తల్లి శరీరంలోకి చేరి, చివరకు శిశువులకు చేరుతున్నట్లు అంచనా.

అధికారుల అభిప్రాయం – ఆందోళన అవసరమా?
జాతీయ విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపిందేమిటంటే:
గుర్తించిన యురేనియం స్థాయిలు WHO అనుమతించే పరిమితికి దిగువన ఉన్నాయి
తక్షణంగా పెద్ద ప్రమాదం లేదని అభిప్రాయం
అయితే వైద్య నిపుణులు మాత్రం మరో కోణాన్ని చెబుతున్నారు:
తల్లి పాలలో యురేనియంకు సురక్షిత పరిమితి ఎలాంటి ప్రమాణం లేదు
దీర్ఘకాలంలో శిశువులకు క్యాన్సర్ కాని ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముందని హెచ్చరిక

అధ్యయనం చేసిన వారు ఎవరు?
ఈ పరిశోధనను:
పాట్నా మహావీర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కు చెందిన డాక్టర్ అరుణ్ కుమార్, ప్రొఫెసర్ అశోక్ ఘోష్ బృందం
న్యూఢిల్లీ AIIMS బయోకెమిస్ట్రీ విభాగం కు చెందిన డాక్టర్ అశోక్ శర్మ బృందం కలిసి చేశారు
తల్లి పాలు, భూగర్భ జలాలు, పర్యావరణ కారకాల మధ్య ఉన్న సంబంధాన్ని ఇంకా లోతుగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Gutta Jwala: నాలుగు నెలల్లో 30 లీటర్ల తల్లి పాలను దానం చేసి ఆదర్శంగా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్
Goat milk : మేకపాలు తాగడం వల్ల లాభమా? నష్టమా?

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు