Rohit – Kohli: భారత క్రికెట్ అభిమానులకు పెద్ద శుభవార్త. రాబోయే భారత్–సౌతాఫ్రికా వన్డే సిరీస్‌తో రోహిత్ శర్మ–విరాట్ కోహ్లీ జోడీ ఒక అరుదైన మైలురాయిని చేరుకోబోతోంది. ఇప్పటివరకు ఈ ఇద్దరు స్టార్ క్రికెటర్లు కలిసి అంతర్జాతీయ మ్యాచ్‌లలో 391 మ్యాచ్‌లు ఆడారు. ఇదే రికార్డు భారత క్రికెట్ లెజెండ్స్ సచిన్ టెండూల్కర్–రాహుల్ ద్రవిడ్ జోడీ పేరిట కూడా ఉంది.
నవంబర్ 30న రాంచీలో మొదటి వన్డేలో రోహిత్–కోహ్లీ కలిసి మైదానంలో అడుగుపెడితే, వారు సచిన్–ద్రవిడ్ రికార్డును అధిగమించి, భారతదేశం తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు కలిసి ఆడిన నంబర్ 1 జోడీగా చరిత్ర పుటల్లో నిలవనున్నారు.
వన్డే సిరీస్‌కి కెప్టెన్ కేఎల్ రాహుల్
నవంబర్ 23న బీసీసీఐ ప్రకటించిన స్క్వాడ్ ప్రకారం, గాయం కారణంగా శుభ్‌మన్ గిల్ వన్డే సిరీస్‌లో పాల్గొనలేడు. దీంతో కేఎల్ రాహుల్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. చాలా రోజుల తర్వాత భారత గడ్డపై రోహిత్–కోహ్లీ జోడీ కలిసి ఆడబోతుండటంతో అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.
ఇతర ప్రముఖ భారత జోడీలు:
సచిన్–ద్రవిడ్ – 391
ద్రవిడ్–గంగూలీ – 369
సచిన్–కుంబ్లే – 367
సచిన్–గంగూలీ – 341
సిరీస్ షెడ్యూల్ & మ్యాచ్ వేదికలు
భారత్–సౌతాఫ్రికా వన్డే సిరీస్:
మొదటి వన్డే: నవంబర్ 30 – రాంచీ
రెండో వన్డే: డిసెంబర్ 3 – రాయ్‌పూర్
మూడో వన్డే: డిసెంబర్ 6 – విశాఖపట్నం
భారత స్క్వాడ్ (ODI Series vs South Africa)
కేఎల్ రాహుల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, తిలక్ వర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ గైక్వాడ్, ప్రసిద్ కృష్ణ, ధ్రువ్ జురెల్, అర్ష్‌దీప్ సింగ్
ఇవీ చదవండి: Sachin And Virat Kohli : సచిన్, కోహ్లీ.. లెజెండరీ క్రికెటర్స్ టెస్ట్ కెరీర్ కంపేరిజన్!
IND vs AUS: అడిలైడ్‌లో కోహ్లీ కళ్లన్నీ రికార్డులపైనే! 50 ఏళ్ల చరిత్రను తిరగరాయనున్న విరాట్!
ROKO : రోహిత్ vs విరాట్ — ఆస్ట్రేలియాపై ఎవరు బెటర్? గణాంకాలు చెబుతున్న నిజం!
