IBOMMA Ravi : ఐబొమ్మ రవి అరెస్ట్ తర్వాత కేసు మరింత ఆసక్తికర మలుపులు తీసుకుంటోంది. అతని నుంచి కీలక సమాచారాన్ని రాబట్టేందుకు హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఏడు రోజుల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇదే సమయంలో రవి తరఫున దాఖలైన బెయిల్ పిటిషన్ పై కూడా వాదనలు జరుగుతున్నాయి.
ED ఎంట్రీ – మనీలాండరింగ్ అనుమానాలు
ఈ కేసులో తాజాగా ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రంగ ప్రవేశం చేసింది. ఐబొమ్మ రవి కేసు వివరాలను పంపించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కి ఈడీ లేఖ రాసింది.
ఇప్పటికే పోలీసులు రవి బ్యాంకు ఖాతాలోని ₹3.5 కోట్లు ఫ్రీజ్ చేశారు. అయితే, విదేశీ అకౌంట్ల నుంచి నిరంతరం భారీ మొత్తాలు రవాణ కావడంతో, మనీలాండరింగ్ జరిగిందనే అనుమానాలు ఈడీ అధికారుల్లో బలంగా ఏర్పడ్డాయి.
అరెస్ట్‌కు దారితీసిన చిన్న క్లూ
తెలంగాణ పోలీసులు గత కొన్నాళ్లుగా రవిపై నిఘా పెట్టారు. దర్యాప్తులో ఓ బెట్టింగ్ యాప్ నుంచి రవికి వచ్చిన డబ్బు క్లూ దొరకడంతో కేసుకు మలుపు తిరిగింది. ఆ యాప్ ట్రాన్సాక్షన్లను ట్రేస్ చేస్తూ పోలీసులు వెళ్లగా, దాని IP అడ్రెస్ మూసాపేటలోని విజ్టా అపార్ట్‌మెంట్స్ వద్ద నమోదైందని గుర్తించారు.
ఇదే సమయంలో ఫ్రాన్స్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన రవిని ఎయిర్‌పోర్టులోనే పోలీసులు అరెస్ట్ చేశారు.
ఇంకా ఏం బయటకు వస్తుంది?
ఇప్పుడంతా సైబర్ క్రైం అధికారులు రవి కార్యకలాపాలపై లోతుగా ఎంక్వైరీ చేస్తున్నారు:
బెట్టింగ్ యాప్‌ల ద్వారా ఎంత సంపాదించాడు?
ఎవరెవరితో ఒప్పందాలు కుదుర్చుకున్నాడు?
విదేశీ ఖాతాల నుంచి వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్లింది?
ఈ ప్రశ్నలకు జవాబులు రావడంతో కేసు మరింత మలుపులు తిరిగే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: I Bomma : ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు – టాలీవుడ్‌ను కుదిపిన పైరసీ మాఫియా భేదాలు
Salaar Teaser: సలార్ టీజర్ రిలీజ్.. ఊరమాస్ ఎలివేషన్స్.. బొమ్మ బ్లాక్ బస్టర్ ఖాయం!
