YS Jagan at Hyd : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తులకు సంబంధించి ఏళ్లుగా నడుస్తున్న కేసులో దాదాపు ఆరేళ్ల తర్వాత మళ్లీ నాంపల్లి సీబీఐ కోర్టు ఎదుట హాజరవుతున్నారు. నవంబర్ 21లోపు తప్పనిసరిగా కోర్టుకు రావాలని ఆదేశించిన నేపథ్యంలో, జగన్ ఒక రోజు ముందుగానే గురువారం (నవంబర్ 20న) హాజరవుతున్నారు.
ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకునే జగన్, బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు వెళ్లనున్నారు. ఉదయం 11 గంటల లోపే కోర్టు ప్రాంగణానికి చేరుకునే అవకాశం ఉంది.
మినహాయింపు పిటిషన్‌పై సీబీఐ అభ్యంతరం
ఇటీవల కోర్టు అనుమతితో యూరప్ పర్యటనకు వెళ్లిన జగన్, తిరిగి వచ్చిన తర్వాత వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోరుతూ పిటిషన్ వేశారు. అయితే, సీబీఐ దీనికి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.
సీబీఐ వాదన ప్రకారం—జగన్ వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందే. మినహాయింపు ఇవ్వడానికి కారణం లేదని స్పష్టం చేసింది. ఈ వాదనలను న్యాయస్థానం సమ్మతించడంతో, నవంబర్ 21లోపు కోర్టుకు వ్యక్తిగతంగా హాజరుకావాలని జగన్‌కు ఆదేశాలు జారీ అయ్యాయి. దాంతో, జగన్ ఒక రోజు ముందే కోర్టుకు హాజరవుతున్నారు.
చివరి హాజరు – ఆరేళ్ల క్రితం
వైఎస్ జగన్ చివరిసారిగా 2020 జనవరి 10న నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత దాదాపు ఆరు సంవత్సరాలకు పైగా గడిచిన తర్వాత ఇప్పుడు మళ్లీ కోర్టు వద్ద ప్రత్యక్షం అవుతున్నారు.
ఇవీ చదవండి: YS Jagan tweet : ఆదాయం గోరంత.. ఖర్చు కొండంత.. ఆందోళనకరంగా ఏపీ ఆర్థిక పరిస్థితి : జగన్
YS Jagan on Medical Colleges : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం : జగన్
YSRCP Meeting : విద్య, వైద్యం, వ్యవసాయం.. అన్నింటా రాష్ట్రం తిరోగమనం: జగన్
