Girl Friend : ప్రస్తుతం పాన్-ఇండియా స్థాయిలో అత్యంత క్రేజీ హీరోయిన్లలో రష్మిక మందన్న ఒకరు. తెలుగు, హిందీ భాషల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ అమ్మడు బాక్సాఫీస్ వద్ద తనదైన మార్క్ క్రియేట్ చేస్తోంది. ఇటీవలే హారర్ థ్రిల్లర్ ‘థామా’తో పాటు, తాజా తెలుగు చిత్రం ‘గర్ల్‌ఫ్రెండ్’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా నవంబర్ 7న విడుదలైంది. ట్రయాంగిల్ లవ్ స్టోరీగా రూపొందిన ఈ చిత్రంలో రష్మిక నటనకు మంచి మార్కులు పడుతున్నాయి. మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ, మెల్లమెల్లగా ఈ సినిమా కలెక్షన్లను పెంచుకుంటోంది. రష్మికతో పాటు అను ఇమ్మాన్యుయేల్, దీక్షిత్ శెట్టి ముఖ్య పాత్రల్లో నటించారు.
పాన్-ఇండియా స్టార్‌గా మారిన రష్మిక, ఒక్కో సినిమాకు రూ.5 నుంచి రూ.6 కోట్లు డిమాండ్ చేస్తోందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అయితే, ‘గర్ల్‌ఫ్రెండ్’ సినిమా కోసం ఆమె రెమ్యునరేషన్ విషయంలో పెద్ద మార్పు ఉందని సమాచారం.
ఎందుకు ఇంత తక్కువ?
‘గర్ల్‌ఫ్రెండ్’ కథాంశంపై రష్మిక ఎంతగానో సంతృప్తి చెందారని, తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉండటంతో, కేవలం రూ.3 కోట్లు మాత్రమే తీసుకున్నారని ఇండస్ట్రీ టాక్. ప్రాజెక్ట్ పట్ల నమ్మకం, కథ పట్ల తనకున్న మక్కువ కారణంగానే పాన్-ఇండియా రేంజ్ రెమ్యునరేషన్ కంటే తక్కువ మొత్తానికి ఆమె అంగీకరించారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇవీ చదవండి: Rashmika Mandanna : చిల్ మూడ్‌లో రష్మిక మందన్నా.. హాట్ పోజులు
Kingdom: మనం కొట్టేశాం..! కింగ్‌డమ్ సక్సెస్‌పై రష్మిక హర్షం
