HomeAndhra PradeshAP TET Notification 2025: ఏపీలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు...

AP TET Notification 2025: ఏపీలో టెట్ నోటిఫికేషన్ రిలీజ్.. నేటి నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం

AP TET Notification 2025: ఏపీ టెట్‌ (Andhra Pradesh Teacher Eligibility Test – TET) అక్టోబర్‌ 2025 నోటిఫికేషన్‌ విడుదలైంది. అభ్యర్థులు అక్టోబర్‌ 25 (శుక్రవారం) నుంచి నవంబర్‌ 23 వరకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ సారి రెగ్యులర్‌ అభ్యర్థులతో పాటు ఇన్‌సర్వీస్‌ టీచర్లు కూడా టెట్‌ పరీక్షకు హాజరుకావడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది.

పరీక్ష ఫీజు చెల్లింపులు అధికారిక వెబ్‌సైట్‌ http://cse.ap.gov.in ద్వారా మాత్రమే చేయాలి. నవంబర్‌ 25న ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహించనున్నారు. హాల్‌ టికెట్లు డిసెంబర్‌ 3 నుండి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

డిసెంబర్‌ 10 నుంచి 20 వరకు ప్రతి రోజు రెండు సెషన్లలో పరీక్షలు జరుగుతాయి — ఉదయం 9.00 నుంచి 12.00 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.00 వరకు. ఫలితాలను జనవరి 19, 2026న విడుదల చేయనున్నట్లు ఏపీ టెట్‌ కన్వీనర్‌ ఎం.వి. కృష్ణారెడ్డి తెలిపారు. పూర్తి వివరాలు http://tet2dsc.apcfss.in వెబ్‌సైట్‌లో లభిస్తాయి.

అభ్యర్థుల సౌకర్యార్థం హెల్ప్‌డెస్క్‌ నంబర్లు కూడా అందుబాటులో ఉన్నాయి:
📞 8121947387, 8125046997, 7995649286, 7995789286, 9963069286

టెట్‌ తప్పనిసరి
టీచర్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌ (TET) అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌, మరియు ఎయిడెడ్‌ పాఠశాలల్లో 1వ తరగతి నుండి 8వ తరగతి వరకు బోధించే ఉపాధ్యాయులకు తప్పనిసరి. ఇది నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ టీచర్‌ ఎడ్యుకేషన్‌ (NCTE) మార్గదర్శకాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అమలులోకి వచ్చింది.

అయితే, 2025 సెప్టెంబర్‌ 1 నాటికి రిటైర్మెంట్‌కు 5 ఏళ్లలోపు సర్వీస్‌ మాత్రమే మిగిలి ఉన్న ఉపాధ్యాయులను టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్‌సర్వీస్‌ టీచర్లపై టెట్‌ తప్పనిసరితనాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

ఇవీ చదవండి: AP DSC : నవంబర్‌లో టెట్.. జనవరిలో డీఎస్సీ నోటిఫికేషన్ : లోకేష్ కీలక ప్రకటన
AP Mega DSC : డీఎస్సీ–2025లో మెరిట్‌ విస్మరణపై హైకోర్టు ఆక్షేపణ

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు