OG Movie: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన తాజా చిత్రం ఓజీ విడుదలకు సిద్దమైంది. సుజిత్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరల పెంపు, ప్రీమియర్ షోలకు అనుమతులు లభించగా, తాజాగా తెలంగాణ ప్రభుత్వమూ ఓజీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
టికెట్ ధరల పెంపు – ప్రీమియర్ షోలుకు అనుమతి
సెప్టెంబర్ 24న రాత్రి 9 గంటలకు ఓజీ ప్రీమియర్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అధికారిక అనుమతి ఇచ్చింది. ఈ ప్రత్యేక ప్రదర్శన టికెట్ ధర జీఎస్టీతో కలిపి రూ.800గా నిర్ణయించారు. సినిమా విడుదలైన రోజు (సెప్టెంబర్ 25) నుంచి అక్టోబర్ 4 వరకు సాధారణ షోలకు కూడా టికెట్ ధరల పెంపునకు అవకాశం కల్పించారు. సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.150 అదనంగా వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మాతలు ఈ నిర్ణయానికి సీఎం రేవంత్ రెడ్డి, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
భారీ అంచనాలు
‘ఓజీ’పై అభిమానుల్లోనే కాదు, సాధారణ ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. రన్ రాజా రన్, సాహో సినిమాలతో పేరు తెచ్చుకున్న సుజిత్ ఈ మూవీని డైరెక్ట్ చేశాడు. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్‌గా నటించగా, ప్రకాశ్ రాజ్, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ఇమ్రాన్ హష్మీ, వెంకట్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, పాటలు సోషల్ మీడియాలో రికార్డులు సృష్టించాయి. ప్రత్యేకంగా ఫైర్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించగా, ఆ తర్వాత వచ్చిన మెలోడీ సాంగ్, గన్స్ అండ్ రోజెస్ ట్రాక్ అభిమానులను ఆకట్టుకున్నాయి. దసరా కానుకగా ఓజీ సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది.
ఇవీ చదవండి: OG Fastest Sales : పవన్ కల్యాణ్ ఓజీ రికార్డు.. ఫాస్టెస్ట్ ప్రీ సేల్స్!
OG Tickets : పవన్ కళ్యాణ్ “OG”కి ప్రత్యేక అనుమతులు.. టికెట్ రేట్ల పెంపు
