AP Assembly : ఏపీ అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య హాట్ హాట్ కామెంట్స్ ఎక్స్ చేంజ్ అయ్యాయి. పర్యావరణ నియంత్రణ, పరిశ్రమల పాత్రపై బోండా ఉమా మాట్లాడుతూ.. పరోక్షంగా పవన్ కల్యాణ్ పై విమర్శలు సంధించారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పవన్.. బోండా తన వ్యాఖ్యలు సరిచేసుకోవాలంటూ చురకలంటించారు. చప్పగా సాగిపోతున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. వీరిరువురి కామెంట్స్ తో కాస్త మసాలా దట్టించినట్లయింది. ఇద్దరి మధ్య వ్యాఖ్యలు చూడండి..
డిప్యూటీ సీఎంపై బొండా ఉమా పరోక్ష విమర్శలు
ప్లాస్టిక్ ని నిరోధించడంలో పవన్ ఆలోచనలు, ప్రభుత్వ ఆలోచనలు చక్కగా ఉన్నాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చాలా నిర్లక్ష్యంగా ఉంది.. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఎక్కడా కూడా పనిచేస్తున్నట్టు కనిపించడం లేదు. ఏదైనా పనిమీద వెళ్తే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారు. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలని డైరెక్ట్ గా పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ చెబుతున్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ కృష్ణయ్య ఇక్కడే ఉన్నారు.
విశాఖలో రాంకీ పరిశ్రమ చాలా పొల్యూషన్ ను డైరెక్ట్ గా సముద్రంలోకి ఇండస్ట్రీ వ్యర్థాలను వదిలిపెడుతున్నారని కృష్ణయ్య చెప్పారు. సీఎం చంద్రబాబు కూడా అలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. కానీ దాని మీద చర్యలు తీసుకోరు.. ఏమిటంటే వాళ్ళకు సంబంధాలు ఉన్నాయో మాకైతే తెలియదు.
అయోధ్య రామిరెడ్డి వైయస్ఆర్ సీపీ ఎంపీ. ఛైర్మన్ కృష్ణయ్యను ఏం మ్యానేజ్ చేస్తున్నారో తెలియడం లేదు. విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా పట్టించుకోవడం లేదు. డిప్యూటీ సీఎంని కోరుతున్నాం పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన గట్టిగా మందలించాలి. ఏదైనా రెప్రజెంటేషన్ ను చైర్మన్ దగ్గరకి తీసుకెళ్లితే నేను 40 సంవత్సరాల్లో ఇలాంటి ఎమ్మెల్యేలు చాలా మంది చెప్పారని మాట్లాడుతున్నారు.. అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యేలు గెలిస్తేనే చైర్మన్ కూర్చొన్నాడు. పెద్ద పెద్ద చేపలను పట్టుకోండి. యాక్షన్ తీసుకోండి. అయోధ్యరామిరెడ్డి, రాంకీ పరిశ్రమ వాళ్లను మీరు ఎందుకు వదిలేశారు?
బోండా ఉమాకు పవన్ కౌంటర్..
బోండా ఉమ మాటలు సరిద్దుకోవాలి. పొల్యూషన్ బోర్డు అందుబాటులో ఉండదు అనడం సరికాదు. మేము రాంకీ సంస్థపై చర్యలు తీసుకున్నాం. షోకాజ్ నోటీసులు కూడా ఇచ్చాం. పరిశ్రమలు వ్యర్థాలు వదిలేస్తున్నారు అంటున్నారు. వాళ్లపై స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటే ఎన్ని కంపెనీలు మూతపడిపోతాయో మనకి తెలీదు. వెంటనే ఏదైనా బ్యాన్ చేద్దాం అంటే కొన్ని కుటుంబాలు రోడ్డున పడిపోతాయి.
నా ఉద్దేశం చిన్నపాటి ఫ్లెక్సీలనే బ్యాన్ చేయాలంటే ఇంతలా ఆలోచిస్తున్నప్పుడు.. పొల్యూషన్ లేకుండా ఏ పరిశ్రమ పనిచేయదు. ఒక రూల్ అప్లై చేయాలంటే.. ఏ రకమైన అస్థిత్వానికి దారితీస్తుందో అనే భయం.. ఇది సీఎంకి కూడా ఉంది. రాంకీ కంపెనీని.. కావాలని టార్గెట్ చేయకూడదు.. వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారని.. ఒక సైడ్ తీసుకున్నారేమో మనకు తెలియదు. వాళ్లు గతంలో పనిచేశారని ఇంటెన్సన్ తో చేస్తే మాత్రం సరికాదు. మనకి ఈరోజుకు వివేకానంద మర్డర్ జరిగిందని తెలుసు.. కానీ ఏమీ చేయలేకపోయాం. అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
ఇవీ చదవండి: OG Tickets : పవన్ కళ్యాణ్ “OG”కి ప్రత్యేక అనుమతులు.. టికెట్ రేట్ల పెంపు
Ustaad Bhagat Singh: షూటింగ్ పూర్తి చేసిన పవన్.. మెగా అభిమానుల్లో సంబరాలు
