Viral News : ప్రపంచంలో హిందూ, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన మొదలైన అనేక మతాలను అనుసరించే ప్రజలు నివసిస్తున్నారు. వీటిలో ఇస్లాం మతం ప్రపంచంలో రెండవ అతి పెద్ద మతం. దాదాపు ప్రతి దేశంలోనూ ముస్లింలు ఉంటారు. అయితే ఆశ్చర్యకరంగా ఒక చిన్న దేశంలో మాత్రం ఒక్క ముస్లింలు కూడా లేరు. అది వాటికన్ సిటీ.
ముస్లింలు అధికంగా ఉన్న దేశాలు
ముస్లింలు అత్యధికంగా నివసించే దేశం ఇండోనేషియా. ఇక్కడే ప్రపంచంలోనే అత్యధికంగా — 231 మిలియన్లకు పైగా ముస్లింలు ఉన్నారు. తరువాతి స్థానాల్లో పాకిస్తాన్ (210 మిలియన్లు), భారత్ (200 మిలియన్లు పైగా) ఉన్నాయి. భారత్ లౌకిక దేశం కాగా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండోనేషియా, మాల్దీవులు, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు అధికారికంగా ఇస్లామిక్ దేశాలుగా గుర్తించబడ్డాయి.
ముస్లింలు లేని దేశాలు
క్రైస్తవ మతానికి పవిత్ర కేంద్రమైన వాటికన్ సిటీలో ఒక్క ముస్లిం కూడా నివసించడం లేదు. పోప్ నివాసముంటున్న ఈ నగరం, క్రైస్తవులకు మక్కా తరహాలోనే పవిత్ర స్థలంగా భావించబడుతుంది.
వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం, వాటికన్ సిటీతో పాటు టోకెలావ్, నియు, ఫాక్లాండ్ దీవులు, కుక్ దీవులు, గ్రీన్లాండ్, సోలమన్ దీవులు, మొనాకో వంటి మొత్తం 47 దేశాలు/ప్రాంతాల్లో ముస్లింలు లేరు.
ఇవీ చదవండి: Waqf Act: ముస్లిం హక్కులకు భంగం కలిగే చట్టాన్ని అంగీకరించం
Ramadan in Malaysia: మీకు తెలుసా.. ముస్లిం దేశం మలేషియాలో రంజాన్ నిబంధనలు ఎలా ఉంటాయంటే..
