HomeAndhra PradeshYSRCP : ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం

YSRCP : ఎల్లుండి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభా పక్ష సమావేశం

YSRCP : ఏపీ శాసన సభ, శాసన మండలి సమావేశాలు 18వ తేదీ నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించనున్నారు. వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో ఎల్లుండి (18.09.2025) జగన్‌ సమావేశం కానున్నారు. ఈ మేరకు వైఎస్సార్ సీపీ ఓ ప్రకటనలో తెలిపింది.

తాడేపల్లి వైఎస్సార్ సీపీ కేంద్ర కార్యాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో (శాసనసభా పక్ష) సమావేశం జగన్ భేటీ అవుతారని పార్టీ తెలిపింది. ఈ సమావేశంలో సమకాలీన రాజకీయ అంశాలు, ప్రజాసమస్యలు తదితర అంశాలపై శాసనమండలి, శాసనసభ సభ్యులతో చర్చించనున్న జగన్‌ చర్చించనున్నారని పార్టీ తెలిపింది.

అసెంబ్లీకి హాజరవుతారా?
వైఎస్సార్ సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలికి రెగ్యులర్ గా హాజరవుతున్నారు. మండలిలో వైఎస్సార్ సీపీకే సంఖ్యా బలం ఉంది. మండలి చైర్మన్ కూడా వైఎస్సార్ సీపీ సభ్యుడే. కానీ శాసనసభకు మాత్రం వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు హాజరు కావడం లేదన్న విమర్శలున్నాయి. అయితే, ప్రతిపక్షంగా అసెంబ్లీలో గొంతు వినిపించే అవకాశం ఇవ్వాలని, సభా నాయకుడితో సమానంగా మాట్లాడగలిగితేనే ప్రజా సమస్యలను సభ దృష్టికి, రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకెళ్లే చాన్స్ ఉందని వైఎస్సార్ సీపీ చెబుతోంది. ప్రతిపక్ష నేత హోదా తాము ఇచ్చేది కాదని, ప్రజలు ఇవ్వాలంటూ టీడీపీ చెబుతోంది. ఈ నేపథ్యంలో జగన్ మీడియా సమావేశాలు నిర్వహిస్తూ ప్రజా సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఇదే మాదిరిగా సభలో మాట్లాడే అవకాశం ఇచ్చినప్పుడే అసెంబ్లీకి వచ్చి ఉపయోగం ఉంటుందని ఆయన స్పష్టం చేస్తున్నారు.

ఇవీ చదవండి: Tomato price : బాబు సాధించిన రికార్డులు ఇవే.. టమాటా, ఉల్లి రైతుల గోడుపై జగన్ ట్వీట్
Way2news Conclave : జగన్ విజన్‌తో అభివృద్ధి.. చంద్రబాబు కలలు అసాధ్యం.. వే2న్యూస్ కాంక్లేవ్‌లో సజ్జల కామెంట్స్
YS Jagan PC : మహిళలకు రూ.1,500, నిరుద్యోగభృతి ఏదీ? సూపర్ సిక్స్ ఎలా హిట్? : జగన్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు