Tirumala News : తిరుమలలో అంగప్రదక్షిణ టోకెన్ల కేటాయింపు విధానంలో టీటీడీ కీలక మార్పు చేసింది. ఇప్పటి వరకు అమలులో ఉన్న FIFO (First In First Out) సిస్టమ్‌ను రద్దు చేసి, ఇకపై లక్కీ డిప్ విధానం ద్వారా టోకెన్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది.
డిసెంబర్ నెల అంగప్రదక్షిణ టోకెన్ల కోసం భక్తులు సెప్టెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత లక్కీ డిప్‌లో ఎంపికైన భక్తులకు మాత్రమే టోకెన్లు కేటాయించబడతాయి.
రోజువారీ టోకెన్ల కేటాయింపు
శుక్రవారాలు మినహా ప్రతిరోజూ 750 టోకెన్లు
శనివారాల్లో మాత్రం 500 టోకెన్లు జారీ చేస్తారు.
అదే విధంగా, ఒకసారి అంగప్రదక్షిణ చేసిన భక్తుడు మళ్లీ ఈ సేవ పొందడానికి ఉండే గడువు 90 రోజుల బదులు 180 రోజులు గా నిర్ణయించారు.
భక్తులు ఈ కొత్త మార్పులను గమనించి, లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ద్వారా టోకెన్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.
ఇవీ చదవండి: Tirumala News : 16న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
Tirumala News : తిరుమలలో 6న అనంత పద్మనాభ వ్రతం
Tirumala News: సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు
