HomeAndhra PradeshTomato price : బాబు సాధించిన రికార్డులు ఇవే.. టమాటా, ఉల్లి రైతుల గోడుపై జగన్...

Tomato price : బాబు సాధించిన రికార్డులు ఇవే.. టమాటా, ఉల్లి రైతుల గోడుపై జగన్ ట్వీట్

Tomato price : ఏపీలో ఉల్లి, టమాటా రైతులు గిట్టుబాటు ధరలేక తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు యూరియా దొరక్క రైతాంగం గంటల తరబడి, రోజుతరబడి వెయిట్ చేయాల్సిన దుస్థితి నెలకొంది. రైతు భరోసా సొమ్ము తొలి ఏడాది ప్రభుత్వం ఇవ్వకుండా మోసం చేసిందని రైతులు వాపోతున్నారు. ఈ తరుణంలో టమాటాలు రోడ్డు పక్కన పారబోస్తున్నారు. ఉల్లిపాయల రైతులదీ అదే పరిస్థితి. రైతులను ఆదుకోవాల్సిన కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే మాజీ సీఎం వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలేక అగచాట్లు పడుతుంటే చంద్రబాబు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. ట్వీట్ సారాంశం ఇదీ..

‘‘చంద్రబాబూ పంటలకు ధరల పతనంలో మీరు సాధించిన రికార్డులు ఇంకెవ్వరికీ సాధ్యం కావు. కర్నూలులో కిలో ఉల్లి మూడు రూపాయలేనా! రూపాయిన్నరకే కిలో టమోటానా! ఇవేం ధరలు? రైతు అనేవాడు బతకొద్దా? కొన్ని వారాలుగా రైతులు లబోదిబో మంటున్నా మీరు కనికరం కూడా చూపడంలేదు కదా? ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ రైతులను ఆదుకోవడంలో ఇంత నిరక్ష్యం చూపుతారా? ఇక ప్రభుత్వం ఉండికూడా ఏం లాభం? ప్రజలు, రైతులు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకోని ప్రభుత్వం ఉన్నా లేనట్టేకదా?

క్వింటా ఉల్లిని రూ.1200కు కొనుగోలు చేస్తామంటూ మీరు ప్రకటనల మీద ప్రకటనలు చేశారు. కానీ తూతూమంత్రంగా చేసి, అదే కర్నూలు మార్కెట్లో వేలం వేయించారు. ఎవ్వరూ కొనడంలేదు, ఏమీ చేయలేమన్న అభిప్రాయాన్ని కలిగించడానికి మీరు చేసిన ప్రయత్నం కాదా ఇది. ఉల్లికి అసలు ధరే లేకపోతే ఇప్పుడు బిగ్ బాస్కెట్, ఇతరత్రా స్టోర్ లో ఆన్లైన్ లో నెట్లోకి వెళ్లి చూస్తే స్టోర్‌లో కిలో రూ.29 నుంచి రూ.32కు ఎలా అమ్ముతున్నారు? రైతు బజార్లో కూడా కిలో రూ.25లకు తక్కువ అమ్మడం లేదు కదా?

మరి రైతులకు ఎందుకు ధర రావడం లేదు? మీ తప్పు కాదా చంద్రబాబుగారూ? ఇంత జరుగుతున్నా రైతులను ఆదుకోవడానికి మీరు కనీసం దృష్టిపెట్టకపోడం అన్యాయం. అటు టమోటా ధరలు కూడా దారుణంగా పడిపోయినా పట్టించుకోవడం లేదు. కొనేవారు లేక పంటలను రోడ్డుమీదే పారబోస్తున్నారు. చంద్రబాబు గారూ..తక్షణం రైతుల పంటలను కొనుగోలుచేసి వారికి అండగా నిలబడి మానవత్వాన్ని చూపండి.’’ అని జగన్ ట్వీట్లో పేర్కొన్నారు.

ఇవీ చదవండి: Way2news Conclave : జగన్ విజన్‌తో అభివృద్ధి.. చంద్రబాబు కలలు అసాధ్యం.. వే2న్యూస్ కాంక్లేవ్‌లో సజ్జల కామెంట్స్
Collectors Conference AP : నేటి నుంచి రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్
Pawan Kalyan : సూపర్ సిక్స్-సూపర్ హిట్.. పార్టీలు వేరైనా ప్రజాశ్రేయస్సే లక్ష్యం : పవన్ కల్యాణ్

RELATED ARTICLES

Leave a Reply

తాజా వార్తలు